India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ప్రాంతాలలో పోలీసు కవాతు నిర్వహించామని ఎస్పీ జి.కృష్ణకాంత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, గ్రామాల్లో ఎన్నికల దృష్ట్యా అల్లర్లు జరగకుండా పోలీసులు కవాతు నిర్వహించారన్నారు.
పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని జిల్లా డాక్టర్ సృజన అధికారులను కోరారు. సార్వత్రిక ఎన్నికలు -2024కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. శనివారం విజయవాడ కేంద్రంగా ఎన్నికల నియమావళిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ హాజరయ్యారు.
మహానంది మండల పరిధిలోని గాజులపల్లి చెక్‌పోస్టు వద్ద రికార్డులు లేకుండా తీసుకువెళ్తున్న నగదు స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో రూ.2.14 లక్షలు, మరో వాహనంలో రూ.2.88 లక్షలు స్వాధీనం చేసుకుని ట్రెజరీలో అప్పగించినట్లు తెలిపారు. బర్రెల వ్యాపారులు ఈ నగదు తీసుకువెళ్తున్నట్లు సమాచారం.
నందవరం మండలం కొత్త నదికైరవాడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాశి అనే రైతు గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగింది. శనివారం మధ్యాహ్నం కాశీ భార్య ఈరమ్మ, పిల్లలు ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇరుగు పొరుగు వారి సహకారంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.20 వేల నగదు, ఫ్రిజ్, సామగ్రి మంటల్లో కాలిపోయిందని బాధితులు తెలిపారు.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది ఉత్సవ భేరి మోగింది. ఉగాది మహోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, స్థానాచార్యులు, అర్చకులు, వేదపండితులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. చంఢీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు చేసి కంకణాలు ధరించారు. రుత్వికులు దీక్ష వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విద్యుత్ షాక్‌తో ఎలుగుబంటి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. మహానంది సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద అరటి తోటకు పెట్టిన విద్యుత్ వైరు తగిలి మృతిచెందినట్లు డిఆర్ఓ హైమావతి తెలిపారు. రేంజ్ ఆఫీసర్ వీఆర్వో సమక్షంలో పశువైద్యాధికారి పోస్టుమార్టం చేయించి దహనం చేసినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో నేటి శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందరికీ స్వామివారి దర్శనం కల్పించాలని ఉద్దేశంతో మల్లన్న స్పర్శ దర్శనాన్ని నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. అందరికీ అలంకార దర్శనమేనని తెలిపారు. కాగా శుక్రవారం వరకు భక్తులందరికీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పించారు.
రానున్న ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనేకుర్తి రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మనేకుర్తి, అంగసకల్, ఎ.గోనెహల్ గ్రామాల వార్డు సభ్యులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి అంబేడ్కర్, వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీగా టీడీపీ కార్యాలయానికి చేరుకొని వీరభద్ర గౌడ్‌ను పూలమాలతో సన్మానించారు.
నంద్యాల: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. ఈనెల 5వ తేదీ వరకు ఉన్న గడువును మరో ఐదు రోజులు ప్రభుత్వం పొడిగించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.