India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదోని నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి లేరు. హెచ్. సత్యనారయణ, రాయచోటి రామయ్య, మీనాక్షి నాయుడులు వరుసగా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ మిస్స్ అయ్యారు. 2014, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వై.సాయి ప్రసాద్ రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా కామెంట్ చేయండి.
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన సుధారాణి, నరసింహులు పెద్ద కూతురు దివ్య ఇంట్లో చదువుకోకుండా స్నేహితులతో ఆడుకుంటోందని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బోర్డర్ చెక్ పోస్టులలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. వాహనాలను క్షుణంగా తనిఖీలు చేయాలని అన్నారు. నంద్యాల జిల్లాలోకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు.
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.
కర్నూలు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు శనివారం నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)-2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. స్కూల్ కాంప్లెక్స్ నుంచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశ్న పత్రాలను తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా 93% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ట్రాఫిక్ డైరెక్టర్ సలీం భాషా శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం పెన్షన్లు 2,46,871 ఉండగా.. 2,31,892 పెన్షన్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా దాదాపుగా 14,979 పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శనివారం నాటికి 100% పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఓబుల్ రెడ్డిగారి బాలిరెడ్డి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు, ఎమ్మెల్యే కాటసానికి పంపించినట్లు తెలిపారు. కొంతకాలంగా ఎమ్మెల్యే, పార్టీ తీరుపై బాలిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈయన త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే సీఎం అవుతారని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మిడుతూరు మండలం 49 బన్నూరులో ఆయన పర్యటించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ అభ్యర్థి ధారా సుదీర్‌ను ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డిని సీఎంగా భారీ మెజార్టీతో గెలిపించాలని బన్నూరు ప్రజలను ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు బలరాముడు, తదితరులు పాల్గొన్నారు.
మద్దికేర గ్రామ శివారులో ఆదివారం ఆటో టైరు పేలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు మృతిచెందగా.. మద్దికేర గ్రామానికి చెందిన గొడుగు వెంకటేశ్వరమ్మ (55) ఇవాళ ఉదయం మరణించినట్లు భర్త ప్రభాకర్ తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది.
కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయం యూజీ, పీజీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు తీసుకొస్తామని వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. యునివర్సిటీ సెనేట్ హాల్లో పరీక్షల నిర్వహణ, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమావేశం నిర్వహించారు. డిగ్రీ 2, 4,6 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ థియరీ పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.