India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీశైల క్షేత్రంలో శనివారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల్లో భ్రమరాంబ దేవికి ప్రత్యేక అలంకారాలు స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా శోభానాగిరెడ్డిది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. 5 సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలిపొందారు. 2009 నుంచి 2014 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోనే 1997లో టీడీపీ ఎమ్మెల్యేగా 46959 అత్యధిక ఓట్ల మెజార్టీ, 2012లో 36795 రెండవ అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ఆళ్లగడ్డలో ఈ మెజార్టీని బ్రేక్ చేసే అవకాశం ఉందా.. కామెంట్ చేయండి
తెలంగాణలోని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ వరకు జరిగిన నంది అవార్డులలో కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి నంది అవార్డులు వరించాయి. ఉత్తమనటుడుగా శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ నటిగా సురభి ప్రభావతి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ మేకప్ మాన్ విభాగాలలో నంది అవార్డులు లభించాయని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు.
తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కర్నూలు నగర ప్రజలకు ఏప్రిల్ రెండవ వారం నుంచి రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని నగరపాలక కమిషనర్ భార్గవ్ తేజ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్షభావ పరిస్థితుల వల్ల సుంకేసుల రిజర్వాయర్లో నీరు అడుగంటిపోయిందన్నారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజులదిన్నె నుంచి కేసీ కెనాల్ ద్వారా నీరు తీసుకొస్తున్నామని ఆయన వివరించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన తగు చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫారం-6, 8లను 16 వరకు స్వీకరించి వాటిని 25వ తేదీ వరకు క్లియర్ చేస్తామన్నారు.
కర్ణాటక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహానందీశ్వర స్వామి దర్శన వేళల్లో మార్పులు చేపట్టినట్లు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు వేకువజామున 3 గంటలకే ఆలయ తలుపులు తెరిచి స్థానిక అభిషేక, అర్చన పూజల అనంతరం అష్టవిధ మహా మంగళహారతులు పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వేకువజామున 4 గంటల నుంచి 6: 30 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మద్దికేర గ్రామ శివారులో ఇటీవల బొలెరో టైరు పగిలి విద్యుత్ స్తంభానికి ఢీకొని బోల్తాపడిన ఘటన తెలిసిందే. అందులో ప్రయాణిస్తున్న మద్దికేర గ్రామానికి చెందిన కూలీలు ఆదిలక్ష్మి (50), సంజమ్మ (40) అదే రోజు మరణించారు. కురువ లక్ష్మీదేవి (35) సావిత్రమ్మ(65) చికిత్స పొందుతూ బుధవార రాత్రి మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. 6న భృంగివాహన సేవ, అమ్మవారికి మహాలక్ష్మి అలంకారం, 7న కైలాస వాహన సేవ మహాదుర్గ అలంకారం, 8న నంది వాహన సేవ, మహాసరస్వతి అలంకారం, 9న రథోత్సవం, అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు. వీటితో పాటు 8వ తేదీన ప్రభోత్సవం, 9న పంచాంగ శ్రవణం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బనగానపల్లె మండలం పసుపుల గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలో రూ. 91 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు సీఐ, పోలీసులు తనిఖీ చేయగా లారీలో ఒక బాక్సులో రూ. 91 లక్షలు నగదు గుర్తించారు. డ్రైవర్ సయ్యద్ మహబూబ్ బాషా బెంగళూరు నుంచి లారీని తీసుకొస్తుండగా సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పారు.
Sorry, no posts matched your criteria.