Kurnool

News April 4, 2024

కర్నూలు: కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

అనంత(D) గుంతకల్లు కస్తూర్బా పాఠశాలలో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి వివరాలు.. మద్దికెర మండలానికి చెందిన బాలిక 8వతరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు తమ స్నాక్స్ చోరీ చేసిందని టీచర్‌కు ఫిర్యాదుచేయడంతో దండించింది. మళ్లీ వారు పీటీకి ఫిర్యాదుచేయగా గ్రౌండ్‌లో రెండు రౌండ్లు వేయాలని శిక్షించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నితో ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది.

News April 4, 2024

నంద్యాల: చెక్‌పోస్ట్ హెల్పర్‌పై చిరుతపులి దాడి

image

టోల్‌గేట్ వద్ద చెక్‌పోస్ట్ హెల్పర్‌పై చిరుతపులి దాడిచేసిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. మహానంది-శిరివెళ్ల సరిహాద్దు పచ్చర్ల టోల్‌గేట్ వద్ద దస్తగిరి చెక్‌పోస్ట్ హెల్పర్‌గా విధులు నిర్వహిస్తుండగా చిరుతపులి అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. అక్కడున్న తోటి అటవీ సిబ్బంది స్థానికుల సాయంతో ఆటోలో గాజులపల్లి సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

News April 4, 2024

కర్నూలు : ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు 

image

కర్నూలుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వై.జానకిరాం, మరో ఇద్దరి మహిళలపై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. కర్నూలు శ్రీరామ్ నగర్‌కు చెందిన కాళేశ్వరమ్మను జానకిరాం వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విజయవాడకు చెందిన రాజ్యలక్ష్మిని రెండో వివాహం, కర్నూలుకు చెందిన నాగమణి మరో వివాహం చేసుకుని మోసగించారని, వారి ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాళేశ్వరమ్మ కోర్టులో ఫిర్యాదు చేశారు. 

News April 3, 2024

కర్నూలు MP స్థానాన్ని ముచ్చటగా మూడోసారి గెలుస్తాం: బీవై రామయ్య

image

దేవనకొండ: కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకుంటామని కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బి.వై.రామయ్య అన్నారు. బుధవారం ఆయన దేవనకొండ, నెల్లిబండ, ఓబులాపురం, గద్దరాళ్ళ గ్రామాలలో పర్యటించారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.విరుపాక్షి, ఆలూరు దేవనకొండ మండల నాయకులు పాల్గొన్నారు.

News April 3, 2024

కర్నూలు: ‘వైసీపీ నేతలను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’

image

వైసీపీ నేతలను అకారణంగా కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా విచక్షణా రహితంగా చేయి చేసుకోవడంపై మండిపడ్డారు.

News April 3, 2024

5వ తేదీలోపు పెన్షన్‌లు పంపిణీ పూర్తి చెయ్యాలి : కర్నూలు కలెక్టర్

image

ఈనెల 5వ తేదీ లోపు పెన్షన్‌ల పంపిణీ పూర్తి చేయలని కలెక్టర్ డాక్టర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూల్ కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అస్వస్థతతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు, నడవలేక వీల్ చైర్స్‌లో ఉన్నవారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వృద్ధ మహిళలకు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేస్తామన్నారు.

News April 3, 2024

జాతీయ స్థాయి క్యారమ్స్ పోటీలకు లిఖితారెడ్డి ఎంపిక

image

ఈ నెల 6 నుంచి 10 వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరగబోయే 51వ జాతీయ సీనియర్ క్యారమ్స్ పోటీలకు కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారిణి వి.లిఖితారెడ్డి ఎంపికైనట్లు జిల్లా క్యారమ్స్ సంఘం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరాజు తెలిపారు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్ర జట్టు ఎంపికల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి జాతీయ పోటీలకు ప్రాతినిథ్యం వహించే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు.

News April 3, 2024

కర్నూలు: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

image

ఓ ప్రేమ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పత్తికొండ మండలం పులికొండలో జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రాజశేఖర్, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో సోమవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మంగళవారం గ్రామ సమీపంలోని ఓ పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న జంటను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.

News April 3, 2024

కర్నూలులో వ్యక్తి దుర్మరణం

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు కర్నూలు ట్రాఫిక్ సీఐ గౌతమి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు బైక్‌పై కురువ బాలన్నగారి ఆదినారాయణ, తన అల్లుడు గిడ్డయ్య కలిసి వెళ్తుండగా హ్యాంగ్ అవుట్ హోటల్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న ఆదినారాయణ అక్కడికక్కడే చనిపోయారు. గిడ్డయ్యకు గాయాలు కావడంతో కర్నూలు GGHకు తరలించామని తెలిపారు.

News April 3, 2024

సచివాలయాల్లోనే పెన్షన్ పంపిణీ: కలెక్టర్

image

సచివాలయాల్లోనే పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సచివాలయ సిబ్బంది అక్కడే ఉండి లబ్ధిదారులకు పెన్షన్ అందజేయాలని కోరారు. వికలాంగులు, అస్వస్థతతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. సచివాలయంలో హైబ్రిడ్ విధానంలో కౌంటర్స్ ఏర్పాటు చేసి పెన్షన్ పంపిణీ చేయాలన్నారు.