India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవనకొండ మండలం పాలకుర్తిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న బోయ లక్ష్మన్న(35) గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య సరస్వతి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. లక్ష్మన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అత్యవసర సేవలందించే వ్యక్తుల పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన ప్రక్రియను బుధవారం సాయంత్రంలోగా పూర్తిచేయాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో మొత్తం సుమారు 36 వేల పోస్టల్ బ్యాలెట్ల అవసరం ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరికి సమర్పించాలి, సంబంధిత ఫార్మేట్‌లపై అవగాహన కల్పించాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు 43.7 డిగ్రీలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో వడగాల్పులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నేటి నుంచి 6వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధితో మంచానికే పరిమితమైన వారు, నడవలేక వీల్ చైర్స్‌లో ఉన్నవారు, వృద్ధ మహిళలకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తారన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళవారం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇటు పాణ్యం అటు బనగానపల్లె నియోజకవర్గాల్లో కాటసాని బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం పింఛన్ల పంపిణీపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4,5 తేదీల్లోపు పెన్షన్లు పంపిణీ పూర్తి కావాలని ఆదేశించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్సీ సామాజికవర్గాలైన కోడుమూరు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ, నందికొట్కూర్ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే తోగూర్ అర్థర్‌ను ప్రకటించింది. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల్ కృష్ణారెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పీజీ రాంపుల్లయ్య పోటీ చేయనున్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. పత్తికొండలో మంగళవారం ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆర్డిఓ రామలక్ష్మి, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లు నుంచి కాచిగూడకు వెళ్లే ప్యాసింజర్ రైలు(07671) సోమవారం నుంచి రద్దైనట్లు డోన్ రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. కాచిగూడ నుంచి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్ రైలు (07670) మంగళవారం నుంచి మే ఒకటో తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ డివిజన్‌లోని మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల్లో రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతుండటంతో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
బనగానపల్లె ఎమ్మెల్యే కొడుకు ఓబుల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘ఒరే ఓబుల్ రెడ్డి లఫూట్. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మీ అన్న నాగార్జున రెడ్డిని రాత్రికి రాత్రి గొంతు నులిమి ఫ్యానుకు వేలాడిదీసినావ్. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన చరిత్ర నీది. నువ్వా మాట్లాడేది మా అన్న గురించి, మా కుటుంబం గురించి. ఆస్తి కోసం హత్య చేసిన దుర్మార్గుడిని నువ్వు’ అని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.