Kurnool

News April 2, 2024

పది’ మూల్యాంకనం ప్రారంభం: డీఈఓ

image

పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభమైనట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శ్యాముల్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 180 లక్షల జవాబు పత్రాలు వచ్చాయన్నారు. ఆరోగ్య సమస్యలున్న ఉపాధ్యాయులకు మూల్యాంకన ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు.

News April 2, 2024

విధుల నుంచి 30 మంది తొలగింపు: కలెక్టర్

image

కర్నూలు: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 31 మందిపై చర్యలు తీసుకున్నామని, అందులో 30 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియమావళి ఉల్లంఘించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 2, 2024

కర్నూలు: విద్యుత్ నియంత్రికలతో ఇబ్బందులు

image

కర్నూలులో సుమారు 1,900 విద్యుత్ నియంత్రికలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నియంత్రికలు తక్కువ ఎత్తులో ఉండటం, ఫ్యూజులకు రక్షణ కవచం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సీతారాంనగర్ మార్కెట్ యార్డు సమీపంలోని ప్రధాన రహదారి అనుకుని విద్యుత్ నియంత్రిక ఉంది. దీనిచుట్టూ కంచె ఏర్పాటు చేయలేదు. నిత్యం వేలాది మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News April 2, 2024

నంద్యాల: భూమా అఖిల ప్రియపై కేసు

image

సార్వత్రిక ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియపై ఉయ్యాలవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మార్చి 28న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన అనుమతులు పాటించకుండా డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారి రఘురాం ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.

News April 2, 2024

కాంగ్రెస్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్

image

రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే 17 మంది అభ్యర్థుల జాబితాను పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి రాంపుల్లయ్య యాదవును ఎంపిక చేశారు. దీంతో యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంది వరుణ్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మల్లిఖార్జున యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

News April 2, 2024

పోలీసు శాఖలో పదవీ విరమణ పొందడం అభినందనీయం: ఎస్పీ

image

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు.
సోమవారం పదవీ విరమణ పొందిన కర్నూలు ట్రాఫిక్ ఎస్సై టీఎస్ఎస్.ప్రసాద్ కుమార్‌ను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు.

News April 1, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.

News April 1, 2024

అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు నిర్వహిస్తాం: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదు, ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు పాల్గొన్నారు.

News April 1, 2024

రేపు పత్తికొండలో కలెక్టర్, ఎస్పీ పర్యటన

image

పత్తికొండలో రేపు (మంగళవారం) కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ పర్యటన ఉంటుందని పత్తికొండ ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి సోమవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎస్పీ పాల్గొంటారని వెల్లడించారు.

News April 1, 2024

కర్నూలు: విద్యార్థిపై అన్నం వండిన గంజి పడి ఆస్పత్రి పాలు

image

హోళగుంద: గంజహళ్లిలో అంగన్వాడీ విద్యార్థి మల్లప్పపై అన్నం గంజి పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. అంగన్వాడీ సెంటర్-2లో మల్లప్ప యూరిన్ పోసి వస్తుండగా.. ఆ సమయంలో ఆయా లక్ష్మి అన్నం గంజిని విసిరినట్లు తెలిసింది. చూసుకోకుండా విసిరినట్లు అంగన్వాడీ ఆయా తెలుపగా.. తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డపై గంజి పోసిందంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.