India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం నుంచి వచ్చే వాహనాలు టౌన్‌లోకి అనుమతించకుండా హైవే మీదుగా డైవర్షన్ చేయాలన్నారు. చామకాలువ నుంచి ఫ్లైఓవర్ మీదుగా బొమ్మల సత్రం, క్రాంతి నగర్‌లకు వెళ్లే వాహనాలను రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ విషయాలను గమనించాలని కోరారు.
బనగానపల్లె మండలంలోని కైప అప్పలాపురం గ్రామాల మధ్య ఆటో బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం జరిగింది. టంగుటూరు గ్రామానికి చెందిన బాల చౌడయ్య(60) ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో బాల చౌడయ్య మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు అన్నారు. బుధవారం కర్నూలు టీడీపీ కర్నూలు పార్లమెంట్ కార్యలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు తమపై నమ్మకం ఉంచి కర్నూలు ఎంపీ సీటు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను అన్నారు. ప్రజల మద్దతుతో ఎంపీగా గెలిచి చంద్రబాబుకు కనుక ఇస్తానన్నారు.
ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిపై జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పీవీ పార్థసారథిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీ టీడీపీ ఇన్‌ఛార్జ్ కే. మీనాక్షినాయుడు ఈ సీటును ఆశించిన విషయం తెలిసిందే.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ YCP, TDP అగ్రనేతలు గెలుపే ప్రధాన ఏజెండాగా పావులు కదుపుతున్నారు. ఈనెల 28న CM వైఎస్ జగన్ నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్ర చేపడుతుండగా, మరోవైపు మాజీ CM నారా చంద్రబాబు ఈనెల 29న ‘ప్రజాగళం’ పేరిట బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో YCP, TDP అధినేతలు జగన్, చంద్రబాబు తమ పార్టీ శ్రేణులలో వరుస కార్యక్రమాలతో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు.
వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కీలక ఆరోపణలు చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా తన హక్కులను ఇతరులకు బదిలీ చేస్తామన్నారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండమన్నారు. దీంతో గెలిచిన 4 నెలలకే రాజీనామా చేద్దామనే భావన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా’ అని వెల్లడించారు.
పత్తికొండ మండలం బొందిమడుగుల గ్రామ శివారులో చెత్తకుప్పలో పడేసిన ఓటరు గుర్తింపు కార్డుల ఉదంతంపై బాధ్యుడైన అప్పటి వీఆర్ఎ శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఆస్పరి తహశీల్దారు కార్యాలయంలో వాచ్‌మెన్ విధులు నిర్వహిస్తున్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఏప్రిల్ నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3 రోజులు ఆలస్యం కానుందని డీఆర్డీఏ-వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ సలీమ్ బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 31 ఆదివారం నాటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, మరుసటి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉందని, 2న పింఛన్ల బడ్జెట్‌ను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుందని చెప్పారు. 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పెన్షనర్లు గమనించాలని కోరారు.
ఎంసీసీ బృందం అనుమతి లేకుండా కరపత్రాలు, బ్యానర్లను ముద్రిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ సృజన ప్రింటర్లను హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ముద్రణ కోసం వచ్చే వ్యక్తి, అతనితో పాటు మరో ఇద్దరి సంతకాలు తీసుకోవాలని, వారికి ఎన్ని కాపీలు కావాలనే వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించి, అనుమతి ఇచ్చిన తరువాతే ముద్రించాలన్నారు.
డోన్ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన ధర్మవరం సుబ్బారెడ్డికి అధిష్ఠానం కీలక పదవి అప్పగించింది. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డోన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం ధర్మవరం సుబ్బారెడ్డి ఎంతో కృషి చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలను చేపట్టి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్న సుబ్బారెడ్డికి పార్టీ ఈ బాధ్యతలు అప్పజెప్పింది.
Sorry, no posts matched your criteria.