India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కవాతు నిర్వహించారన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలకు TDP చీఫ్ చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఆలూరు అసెంబ్లీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆ నియోజకవర్గ నేతలు, ప్రజల్లో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, వచ్చే జాబితాలో ఆ సీటు కేటాయింపుపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మిగనూరులో ఈనెల 29న సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, MLC మధుసూదన్, కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య, ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక తెలిపారు. YWCS గ్రౌండ్‌లో సాయంత్రం మేము సిద్ధం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
జిల్లాలోని పోలీసు అధికారులందరూ ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెక్పోస్టుల్లో నగదు, అక్రమ మద్యం, గంజాయి రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నంద్యాల నుంచి MPగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ, మైనారిటీ ఓట్లు అత్యధికంగా ఉండడంతోపాటు అప్పటి కాంగ్రెస్ హాయంలో ఆమె తండ్రి దివంగత CM వైఎస్ రాజశేఖర రెడ్డికి భారీ మెజారిటీ అందించిన స్థానాల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం ఒకటి. ఉమ్మడి జిల్లాలో అప్పటి కాంగ్రెస్ నేతలను ఆమె మళ్లీ పార్టీలోకి వచ్చేలా ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఏపీలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో TDP అధినేత ఎన్నికల సమరానికి సై అంటున్నారు.ఇందులో భాగంగా ప్రజాగళం పేరుతో కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలంలో ఈనెల 29న చంద్రబాబు రోడ్ షోలో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
నంద్యాలకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లాలో రెండు చేతులు బ్లేడుతో కోసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇతను గోనెగండ్లలో పని చేసేవారు. ఇటీవల ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వెళ్లకుండా ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో అద్దెకు దిగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ ను గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లే కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తం ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల లోపు వారే దాదాపు 50 శాతంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 20 నుంచి 29 ఏళ్ల లోపు వాళ్లు 6,90,703 మంది ఉండగా 30 నుంచి 39 ఏళ్ల వాళ్లు 9,63,220 మంది ఉన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నాయకుల భవితను నిర్ణయించేందుకు వీళ్లు సిద్ధంగా ఉన్నారు.
బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సోదరుడు, అవుకు కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ చల్లా విజయ భాస్కర్ రెడ్డి, ఆయన బావమరిది కాశీపురం మెట్ల రామిరెడ్డి టీడీపీలో చేరారు. అమరావతిలోని చంద్రబాబు స్వగృహం నందు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
డోన్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం కలిశారు. గతంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. తదుపరి పరిణామాల వల్ల సూర్యప్రకాశ్ రెడ్డికి సీటు కేటాయించారు. నియోజవర్గం పరిస్థితులపై బాబు ఇరువురి నేతలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.