India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప MLA అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి రెడ్డిని అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. YCP సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో ఆమె ఆమె తలపడనున్నారు. ఈమె ప్రస్తుతం కడపలో నివశిస్తున్నా.. సొంత ఊరు నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామం అని తెలిపారు. ఈమె భర్త కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి.
అదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన పింజరి కాశీం అనే వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత నెల 26వ ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణశర్మ వాహనాన్ని కాశీం బైక్ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బనగానపల్లెలో శనివారం విషాదం చోటుచేసుకుంది.
పదవ తరగతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న షాషావలి(55) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతిచెందారు. పరీక్షా కేంద్రంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చి ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలారు. స్థానికులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
నకిలీ దస్త్రాలను సృష్టించి భూమిని సొంతం చేసుకునేందుకు సహకరించిన తహశీల్దార్ కుమారస్వామి, వీఆర్వో బీటీ సురేశ్‌పై శుక్రవారం కేసు నమోదైందని పెద్దకడుబూరు ఎస్ఐ మహేశ్ కుమార్ తెలిపారు. ఆదోనికి చెందిన స్వామినాథన్‌కు చిన్నతుంబళం గ్రామంలో 2.52 ఎకరాల భూమీ విషయంలో నకిలీ పత్రాల సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
టికెట్ రాకపోవడంతో తిక్కారెడ్డి, ఆయన అనుచరులు TDP అధిష్ఠానంపై మండిపడుతున్నారు. తన భవిష్యత్ కార్యచరణ కోసం ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తిక్కారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా హైకమాండ్ తిక్కారెడ్డిని బుజ్జగించి రాఘవేంద్రరెడ్డి విజయానికి పనిచేసేలా చేయకపోతే గెలుపు కష్టమేనని స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
బేతంచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన గోరంట్ల మహేశ్ అనే యువకుడు గురువారం పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ శంకర్ నాయక్ తెలిపారు. గోరంట్ల మహేశ్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి 2014, 2019లో TDP తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కాదని ఈసారి రాఘవేంద్రరెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తిక్కారెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. మూడో జాబితాలో అయినా తననే అభ్యర్థిగా ప్రకటిస్తారేమోనని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తిక్కారెడ్డి TDPలోనే కొనసాగుతారా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తోంది.
నంద్యాల: ఎన్నికలు ముగిసే వరకు నాయకులు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుటకు పోలీస్ శాఖ వారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు అభ్యర్థులు, నాయకులు సహకరించాలన కోరారు.
గోనెగండ్లలోని లక్ష్మీపేటలో జరిగే ఒక పెళ్లికి ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి చెందిన ఎల్లారెడ్డి కుటుంబంతో పాటు వారి కుమారుడు అరుణ్ కుమార్(6) వచ్చాడు. పెళ్లి సందడిలో ఉండగా అరుణ్ కుమార్ కొంతమంది పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి సృజన హెచ్చరించారు. శుక్రవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీ విజిల్ ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.