Kurnool

News August 14, 2024

శ్రీశైలం డ్యామ్ పరిసరాల్లో చేపల వేట నిషేధం

image

శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. జులై, ఆగస్టులో చేపలు సహజ సంతానోత్పత్తి సమయం అని మత్స్యశాఖ పేర్కొంది. ఈ సమయంలో జలాశయంతో పాటు వెనక జలాల్లో చేపల వేట చేయొద్దని ఆదేశించింది. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు ఇటీవల పుట్టీలపై చేపల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

News August 14, 2024

సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటాం: కర్నూల్ ఎస్పీ

image

పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో ఆధారాలు సేకరించామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటామని అన్నారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. శ్రీనివాసులు తలపై వెనుక నుంచి గొడ్డలితో నరికినట్లు గుర్తించామన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

News August 14, 2024

నంద్యాల జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య

image

అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా మృతులు మహేశ్వర్ రెడ్డి(40), భార్య శాంతి(35)గా పోలీసులు గుర్తించారు. గ్రామంలోని తమ పొలంలో విష ద్రావణం తాగి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 14, 2024

శ్రీనివాసులు హత్య వైసీపీ మూకల పనే: నారా లోకేశ్

image

పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులును వైసీపీ నేతలే హత్య చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు. శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

News August 14, 2024

పత్తికొండ వద్ద టీడీపీ నేత హత్య

image

కర్నూలులో జిల్లాలో దారుణ హత్య జరిగింది. పత్తికొండ మండలం హోసూరులో బుధవారం తెల్లవారుజామున టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులును దుండగులు హత్య చేశారు. కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో నరికినట్లు తెలుస్తోంది. గ్రామంలో పోలీసులు భారీగా మొహరించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News August 14, 2024

కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైల బదిలీ

image

జిల్లాలో ఆరుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. కర్నూలు 1వ పట్టణ ఎస్సై బాలనర్సింహులును హొళగుందకు, ఎమ్మిగనూరు ఎస్సై రమేశ్ బాబు కర్నూలు 1వ పట్టణ పీఎస్, వీఆర్‌లో ఉన్న ప్రహైద్‌ను ఆదోని పీసీఆర్‌కు, తిరుపతి వీఆర్‌లో ఉన్న పరమేశ్ నాయక్‌ను మంత్రాలయం స్టేషన్‌కు, కర్నూలు వీఆర్‌లో ఉన్న హెచ్‌.డా.నాయక్‌ను ఎమ్మిగనూరు స్టేషన్‌కు, అనంతపురం జిల్లా బొమ్మనహల్‌లో ఉన్న శ్రీనివాసులును నందవరం పీఎస్‌కు బదిలీ చేశారు.

News August 14, 2024

ఆదోని: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7749 పలికింది. సోమవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.10 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,000, వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,280 కనిష్ఠ ధర రూ.3,449 పలికింది. మార్కెట్‌లో 509 క్వింటాళ్ల పత్తి, 3320 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News August 13, 2024

BREAKING: రాయలసీమ రేంజ్‌లో భారీగా సీఐల బదిలీ

image

రాయలసీమ రేంజ్ పరిధిలో ఒకేసారి 62మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 18 మంది సీఐలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా మరోవైపు ఇప్పటికే వీఆర్‌లో ఉన్న 15 సీఐలకు పోస్టింగ్ లభించింది. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఐలను డీఐజీ డా.కోయ ప్రవీణ్ నియమించారు.

News August 13, 2024

రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి 353వ ఆరాధన ఉత్సవాలకు రావాలంటూ సీఎం చంద్రబాబుకు మఠం అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 18 నుంచి 24 వరకు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాలు ఉంటాయని సీఎంకు వివరించారు. ఆహ్వాన పత్రికతో పాటు రాఘవేంద్ర స్వాముల వారి ప్రసాదాన్ని అందజేశారు.

News August 13, 2024

విద్యుత్ వెలుగులతో ఆకట్టుకుంటున్న కొండారెడ్డి బురుజు

image

కర్నూలు నగరం ఆగస్టు 15న జరిగే 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా అధికారులు కొండారెడ్డి బురుజును త్రివర్ణ పతాక విద్యుత్ వెలుగులతో సిద్ధం చేశారు. ఈ దృశ్యాన్ని చూడటానికి నగర ప్రజలు తరలి వస్తున్నారు.