Kurnool

News July 6, 2024

నందికొట్కూరులో వైసీపీని వీడి టీడీపీలో చేరిక

image

నందికొట్కూరు మున్సిపాలిటీలోని 12వ వార్డుకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు మారుతీ నగర్ బొల్లెద్దుల ఏసన్న ఆధ్వర్యంలో 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రసాద్, అశోక్, ప్రభాకర్, డేవిడ్, రాజేశ్, నాగులు, యేసేపు, తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రాజశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

News July 6, 2024

నంద్యాల: ‘నీలా’ పేరుతో రోబో ఆవిష్కరణ

image

పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్), బీఎస్ విభాగం ఆధ్వర్యంలో నీలా పేరుతో రోబోను ఆవిష్కరించారు. ఈ రోబో లైబ్రరీ నిర్వహణ, కార్యకలాపాలకు సహాయం చేయడం వంటి పనులు నిర్వహిస్తుందని యూనిఫాస్ట్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు సుబ్రమణ్యం తెలిపారు. ఈ రోబోపై విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఏఐ, ఎంఎల్ పద్ధతులను ఉపయోగించి పరిశోధనలు చేయవచ్చన్నారు.

News July 6, 2024

కర్నూలు: లా సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా కోర్సుకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 3, 5వ సంవత్సరాల 2, 4, 6, 8, 10వ సెమిస్టర్లకు సంబంధించిన ఫలితాలను రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను రాయలసీమ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు.

News July 6, 2024

6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

వెనుకబడిన ప్రాంతాల్లో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్న 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పత్తికొండ నియోజకవర్గంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్యాంబాబు మాట్లాడుతూ.. పత్తికొండ నియోజకవర్గం నుంచి వెనకబడ్డ మండలంగా మద్దికేరను ఎంపిక చేశారన్నారు.

News July 6, 2024

కర్నూలు: జాతీయ స్థాయి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారు ఈనెల 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 5, 2024

ఏపీ, తెలంగాణ సీఎంల భేటీకి మంత్రి జనార్దన్ రెడ్డి

image

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. వీరి భేటీలో ఏపీ నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేశ్ పాల్గొననున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్‌, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.

News July 5, 2024

బకాయిలు చెల్లించని షాపులపై అధికారుల కొరడా

image

కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన దుకాణాలను లీజుకు తీసుకుని, అద్దె చెల్లించని షాపులపై నగరపాలక రెవెన్యూ అధికారులు శుక్రవారం కొరడా ఝుళిపిస్తున్నారు. 3 నెలలుగా బకాయిలు చెల్లించని షాపులను సీజ్ చేస్తున్నారు. కమిషనర్ ఏ.భార్గవ్ తేజ ఆదేశాలతో నగరపాలక రెవెన్యూ అధికారులు రెండో రోజు స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు. నేడు రూ.12,26,261ను వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

News July 5, 2024

నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్

image

నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు శుక్రవారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బైరెడ్డి మాట్లాడుతూ.. ఎవరి బెదిరింపులకూ భయపడవద్దని, అందరం కలిసి పేదల అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

News July 5, 2024

మంత్రాలయం మండలంలో ఒడిశా వాసి మృతి

image

మంత్రాలయం మండలం సుగూరు గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతిచెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మంత్రిగాండ్ అనే వ్యక్తి బోర్ వెల్ లారీలో దినసరి కూలీగా పనిచేసేవాడు. పని ముగించుకుని అదే లారీపై తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా పైకి లేవడంతో పైన ఉన్న సర్వీస్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు.

News July 5, 2024

రేపు జడ్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు అందని సమాచారం

image

కర్నూలులో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. ఈ సమావేశాలకు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు సమాచారం అందకపోవడం గమనార్హం. జడ్పీ పాలక వర్గంలో ఛైర్మన్‌తో పాటు 52 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లేకుండా జడ్పీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.