India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.

కర్నూలు జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోని 1.61 లక్షల నిరక్షరాస్యులకు వాలంటీర్ల ద్వారా చదువు నేర్పించి, మార్చి 29న జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి, ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందించి ప్రోత్సహించాలని సూచించారు.

ప్రజా ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 72 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు, ఇన్వెస్ట్‌మెంట్, భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండి శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సర్వీస్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

మద్దికేరలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తుండగా బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.

సంక్రాంతి పండగ సందర్భంగా పేకాట, జూదం, కోడి పందేలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డీఐజీ, కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సంప్రదాయ క్రీడలకే పరిమితం కావాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడి పందేలు సహా అన్ని చట్టవ్యతిరేక ఆటలు పూర్తిగా నిషేధమన్నారు. పందేలు నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కర్నూలులో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం కేజీ రూ.260 ఉండగా నేడు రూ.300 పలుకుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం సంక్రాంతి, కనుమ రానుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 70% తెలంగాణ నుంచి బ్రాయిలర్ కోళ్లు సరఫరా అవుతున్నాయి. 25% కర్ణాటక నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. 5% మాత్రమే జిల్లాలో కోళ్ల ఉత్పత్తి అవుతోంది.

కనీసం వార్డు మెంబర్‌గా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి చట్టసభలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం విడ్డూరమని MLC బీటీ నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సజ్జల అనాలోచిత సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని విమర్శించారు. సలహాదారుగా ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ఆయనను తిరస్కరిస్తున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.