India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు మండలం గార్గేయపురం గొల్ల వీధిలోని అతి పురాతన బావిలో ఉన్న శివాలయం నందు పార్వతీ దేవి విగ్రహం కన్ను తెరిచారనే ప్రచారం వైరలవుతోంది. ఈ విషయం తెలిసిన జనాలు పక్క ఊర్ల నుంచి తండోపతండాలుగా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తాలూకా పోలీసులు చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు తోసుకోకుండా అమ్మవారిని చూసేందుకు ఒక్కొక్కరిని పంపుతున్నారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెకు చెందిన శివరాఘవ రెడ్డి(22) సూసైడ్ చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పీఆర్‌టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో అద్దెకు తీసుకున్న రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుడు బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
నంద్యాలలో మంగళవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. శిరివెళ్లకు చెందిన అత్తార్ అస్లాం(26), తిమ్మాపురం గ్రామానికి చెందిన కాకాని కళ్యాణ్ బైక్‌పై సంజీవ నగర్ నుంచి శ్రీనివాస సెంటర్ వస్తున్నారు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. తీవ్ర గాయాలతో అస్లాం మృతి చెందాడు. గాయపడిన కళ్యాణ్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతి పండగ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. సోమవారం బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురంలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, మహిళలపై నేరాలు, చీటింగ్‌లపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయి సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, డెయిల్ 100, 1930, 112 టోల్ ఫ్రీ నంబర్ల ఉపయోగాలను ప్రజలకు వివరించారు.
2021-22 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఏఎస్పీగా మందా జావళి ఆల్ఫోన్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లాలో ట్రైనీ IPSగా మందా జావళి శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా మరోవైపు నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా యుగంధర్ బాబు విధులు నిర్వర్తిస్తున్నారు.
సంక్రాంతి పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో నూతన కాంతులు, సంతోషాలు నింపాలని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భోగి, మకరసంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఆళ్లగడ్డలో వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చాగలమర్రికి చెందిన డా.మౌలాలి డాక్టరేట్ పొందారు. అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.గణేశ్ నాయక్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ కర్నూల్ డిస్త్రీక్ట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కేఎస్‌వీ కృష్ణారావు డాక్టరేట్‌ను జారీ చేశారు.
పిన్నాపురం గ్రీన్‌కో ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని YCP నేతలు పేర్కొన్నారు. దీనిపై మంత్రి TG భరత్ స్పందించారు. ‘2018లోనే TDP ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడానికి జగన్ కృషే కారణమని కొందరు చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి జగన్ తన పదవీ కాలంలో కొన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. ఇకనైనా ప్రజలను తప్పుదారి పట్టించడం మానేయాండి’ అని మంత్రి అన్నారు.
రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పి మంచి పౌరులుగా జీవించాలన్నారు. ఆదివారం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి నేడు మీరూ భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
Sorry, no posts matched your criteria.