Kurnool

News June 25, 2024

కర్నూలు జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే?

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1801 ఎస్టీటీలతో కలిపి మొత్తం 2678 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

కర్నూలు: బసవన్నలకు రెండ్రోజుల సెలవులు

image

ఎద్దులకు రెండు రోజులు హాలిడేస్. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్నభోంపల్లి రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ గ్రామ రైతులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రెండ్రోజుల పాటు పొలంలో ఎద్దులతో పనిచేయించరు. వాటిని ముస్తాబు చేసి డప్పు వాయిద్యాలతో ఊరేగించి వేడుక చేస్తారు. ఇందులో భాగంగా నిన్న బసవన్నలను ఊరేగించారు. ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తోందని ఆ గ్రామ రైతులు తెలిపారు.

News June 25, 2024

కర్నూలు: నకిలీ బంగారు గాజులతో బురిడీ

image

నకిలీ బంగారు గాజులు తాకట్టు పెట్టి రూ.లక్షల రుణం తీసుకునన్న ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం మాయలూరుకు చెందిన లక్ష్మీనారాయణ, పేరుసోములకు చెందిన అమీర్‌ గతేడాది కోవెలకుంట్లలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌‌లో నకిలీ బంగారు తాకట్టు పెట్టి రూ.6.66లక్షలు రుణంగా తీసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో ఆ గాజులు నకిలీవని తేలడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల ఎస్సై వరప్రసాద్‌ తెలిపారు.

News June 25, 2024

విధుల నుంచి రిలీవ్‌ అయిన కర్నూల్ కలెక్టర్‌

image

కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి డా.జి.సృజన రిలీవ్ అయ్యారు. NTR జిల్లా కలెక్టర్‌గా బదిలీ అవడంతో జేసీ నారపురెడ్డి మౌర్యకు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. తాను జిల్లా కలెక్టర్‌గా విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్క అధికారి సహకరించారని తెలిపారు. హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఎన్నికలను విజయంవంతంగా నిర్వహించామని చెప్పారు. జిల్లా అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

News June 25, 2024

పల్లకిలో విహరించిన మహానందీశ్వర దంపతులు

image

మహానంది ఆలయంలో సోమవారం రాత్రి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు స్థానిక అలంకారం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, అలంకారపూజ చేపట్టారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాకారం చుట్టూ పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

News June 24, 2024

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

తుగ్గలి మండలం పరిధిలోని ముక్కెళ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముక్కెళ్ల సమీపంలో రాజశేఖర్ ఉండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. అతడిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో రాజశేఖర్ మృతి చెందారు.

News June 24, 2024

కర్నూలు: గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి మృతి

image

తుగ్గలి మండలం పరిధిలోని రాతన గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాముడు(58) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. సంజామల మండలానికి చెందిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ , ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

News June 24, 2024

కర్నూలు: డీలర్ షిప్ ఇప్పిస్తానంటూ రూ.10 లక్షలు మోసం

image

కర్నూల్ నగరంలోని జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్   సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో  54  ఫిర్యాదులు వచ్చాయి. ఎమ్మిగనూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తి ఎయిర్ టెల్, డిటిహెచ్ నెట్ వర్క్‌ల గురించి నేర్పించి, డీలర్ షిప్ ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఎమ్మిగనూరు చెందిన రమేశ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

News June 24, 2024

కేబినెట్ ఆమోదం.. కర్నూల్ జిల్లాలో 4.69 లక్షల మందికి లబ్ధి!

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పింఛన్ పెంపునకు ఆమోదం తెలిపింది. ₹3 వేల నుంచి ₹4 వేలకు పెంచింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయనుంది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో కర్నూలు జిల్లాలో సుమారు 2.45 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.24 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో కర్నూల్ జిల్లా మంత్రులు

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, ఫరూక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.