Kurnool

News June 24, 2024

కర్నూల్ జిల్లాకు వర్ష సూచన

image

కర్నూల్, నంద్యాల జిల్లాలకు నేడు వర్ష సూచన ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మంగళ, బుధవారాల్లో జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News June 24, 2024

కర్నూలులో వైసీపీ కార్యాలయం ఇదే

image

అక్రమ నిర్మాణమని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంతో రాష్ట్రంలోని ఆ పార్టీ కార్యాలయాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా వైసీపీ కార్యాలయాన్ని కూడా అనుమతులు లేకుండా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నడిబొడ్డున అయిదురోడ్ల కూడలిలో 1.60 ఎకరాల్లో ఈ భవన నిర్మాణం జరగుతోంది. రూ.100 కోట్ల విలువైన ఈ భూమిని గతంలో ఏపీఆగ్రోస్‌కు కేటాయించగా.. దాన్ని తిరిగి తీసుకుని వైసీపీకి ఇచ్చారు.

News June 24, 2024

కర్నూల్ కొత్త కలెక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా..

image

కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన రంజిత్ బాషా 2018లో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేశ్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఆయనకు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఇక బాల్యంలో ఆయన విద్యాభ్యాసం జిల్లాలోనే సాగింది. నందికొట్కూరులోని సంతపేట పాఠశాల, ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని ఏపీ గురుకులం, నందికొట్కూరు ప్రభుత్వ కళాశాలల్లో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివారు.

News June 24, 2024

నేడు కర్నూల్, నంద్యాల జిల్లా ఎంపీల ప్రమాణ స్వీకారం

image

18వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా జిల్లా ఎంపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. వీరిరువురూ తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి వ్యవహరించనున్నారు.

News June 24, 2024

అర్జీలు స్వీకరించనున్న నంద్యాల ఎస్పీ

image

ఈనెల 24వ తేదీన సోమవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” (పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం) ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 23, 2024

నంద్యాలలో భర్తను హత్య చేసిన భార్య

image

నంద్యాల పట్టణంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోని సుద్దుల పేటలో హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భర్తను భార్యే కత్తెరతో పొడిచింది. తీవ్ర గాయాలైన అతడిని నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News June 23, 2024

టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి

image

లోక్‌సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని సీఎం చంద్రబాబు నియమించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఆమె తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహానందరెడ్డిపై విజయం సాధించారు.

News June 23, 2024

కర్నూలు: తపాల ఉద్యోగి సూసైడ్

image

పొలాల్లో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కోడుమూరు మండలం ముడుమాలగుర్తికి చెందిన మల్లికార్జున్ కర్నూలులో ఉంటూ పోస్టు ఆఫీసులో విధులు నిర్వహించేవారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని మృతిచెందారు. ఆదివారం పొలాలకు వెళ్తున్న రైతులు గుర్తించి ఉండవెల్లి పోలీసులకు సమాచారం అందించారు.

News June 23, 2024

ఎమ్మిగనూరు: సెంచరీ కొట్టిన టమోటా ధరలు

image

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.రూ. 80 లోపు ఉన్న టమోటా ధర ఆదివారం ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లో సెంచరీ కొట్టింది. టమోటా కేజీ ధర రూ. 100కు చేరుకోవడంతో సామాన్యులు కొనలేక బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి సబ్సిడీ కింద ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లో సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

News June 23, 2024

టీడీపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి

image

నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారి నంద్యాల నుంచి గెలిచిన ఆమెకు ఈ అవకాశం ఇవ్వడంతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.