India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బనగానపల్లెలోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పంచాయతీ కార్యాలయంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య అంశంపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బనగానపల్లె వాసులకు పంచాయతీ ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ (ఆర్‌యూ) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. వివరాలను యూనిర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఇన్‌ఛార్జ్ వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. 2,647 మంది విద్యార్థులు రెగ్యులర్ కింద పరీక్షలు రాయగా.. వారిలో 2,499 మంది పాసయ్యారు. సప్లిమెంటరీ కింద 370 మంది పరీక్షలు రాయగా.. 342 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద జిల్లాలో సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్నదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద రీ సర్వేపై జిల్లాలోని RSDTలు, మండల సర్వేయర్లకు, డిప్యూటీ తహశీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
23 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. రూ.3,39,61,457 నగదుతో పాటు 139 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 400 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ ఆదాయంగా చేకూరింది. పటిష్ఠమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్యన లెక్కింపును చేపట్టామని ఈవో ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో రమణమ్మ తెలిపారు.
పదేళ్ల బాలికకు అసభ్యకర ఫొటోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కర్నూలు బుధవారపేటకు చెందిన బొగ్గుల రాజేశ్‌కు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు మూడేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2021 జూన్‌లో కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి పై విధంగా తీర్పునిచ్చారు.
ఆత్మకూరు కేంద్రంగా 3 రోజుల పాటు జరిగిన ఇస్తేమా కార్యక్రమంలో భాగంగా చివరి రోజైనా గురువారం వేడుక ముగుస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి ట్రాఫిక్ సమస్య వాటిల్లకుండా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.
పోర్న్ సైట్ల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పోర్న్ సైట్లు చూస్తున్న వారిని కొంతమంది బెదిరించి, డబ్బు దోచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే అనవసర లింక్స్ ఓపెన్ చేయవద్దని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉ.11:45 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11:50 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి గడివేముల మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అప్పర్ రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో శ్రీ నవనంది పాఠశాల విద్యార్థి ప్రతిభ కనబరిచారు. నందికొట్కూరులోని నవనంది హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ముర్తుజా వలి గత నెల 26 నుంచి 29వ తేదీ వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో 55 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ఛైర్మన్ శ్రీధర్ అభినందించారు.
Sorry, no posts matched your criteria.