Kurnool

News January 5, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

News January 5, 2025

సీఎస్ కర్నూలుకు రావడం గర్వకారణం: కలెక్టర్

image

కర్నూలుకు రావాలని ఆహ్వానించగానే చీఫ్ సెక్రటరీ విజయానంద్ జిల్లాలో పర్యటించడంపై కలెక్టర్ పీ.రంజిత్ బాషా హర్షం వ్యక్తం చేశారు. బీ.క్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎస్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నట్లు సీఎస్‌కు వివరించారు. ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం అమలు హర్షణీయమని కలెక్టర్ కొనియాడారు.

News January 4, 2025

కబళించిన మృత్యువు!

image

ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.

News January 4, 2025

నంద్యాల: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

image

నంద్యాల నుంచి దిగువ మెట్ట వెళ్లే మార్గంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు వెల్లడించారు. డోన్ నుంచి గుంటూరు వరకు వెళ్లే రైలులో ఓ వ్యక్తి ప్రయాణం చేశారని చెప్పారు. చలమ నుంచి దిగువమెట్ట వరకు ఉన్న రైలు మార్గంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు.

News January 4, 2025

విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి: కలెక్టర్

image

విద్యార్థులు చదువును విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యనభ్యసిస్తే ఉన్నత స్థితిలో రాణించగలుగుతారని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని ఎస్పీజీ పాఠశాలలోని జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా మంచిగా చదువుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు.

News January 3, 2025

‘కొత్త ఇసుకను రీచ్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి’

image

రాష్ట్రంలో కొత్త రీచ్‌లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఇసుక సరఫరా అంశంపై గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పీ.రంజిత్ బాషా హాజరై మాట్లాడారు.

News January 3, 2025

ఉపాధి పనులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలని ఏపీడీ, ఏపీవోలను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. అధ్వాన రీతిలో ప్రగతి చూపిన అధికారుల ఫైళ్లను సర్క్యులేట్ చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు.

News January 3, 2025

టమాటా రైతులకు కాస్త ఊరట

image

పత్తికొండ టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు 25కిలోల బాక్సు కేవలం రూ.30కి మాత్రమే అమ్ముడయ్యాయి. కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా నిన్న కొంత మేర ధర పెరగడంతో ఊరట చెందారు. కిలో గరిష్ఠంగా రూ.18 పలికింది. సరాసరి రూ.15, కనిష్ఠ ధర రూ.10తో క్రయ విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్‌కు 180 క్వింటాళ్ల టమాటా వచ్చింది.

News January 3, 2025

డాక్టర్లూ మీరు గ్రేట్ ❤

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మం. కలుగొట్ల గ్రామ ప్రజలకు ఆ ఊరికి చెందిన నలుగురు డాక్టర్లు ఉచిత వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్, జాన్ పాల్, మద్దమ్మ, కృష్ణ అనే వైద్యులు గురువారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ, తదితర టెస్టులు చేసి ఫ్రీగా మందులు అందించారు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సొంత ఖర్చుతో వైద్య శిబిరం నిర్వహించామని వారు తెలిపారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News January 3, 2025

కర్నూలు జిల్లాకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలు.!

image

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని నదులన్నింటినీ గోదావరి నుంచి బాణాకచర్లకు అనుసంధానిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.