Kurnool

News June 15, 2024

కర్నూలు: గుండెపోటుతో ఎంఈఓ మృతి

image

చిప్పగిరి మండలంలో ఎంఈఓ-2 బాలనాయుడు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. బాలనాయుడు బళ్లారి పట్టణంలో నివాసం ఉంటూ చిప్పగిరిలో ఎంఈఓ-2గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం రోజు మాదిరిగానే చిప్పగిరికి ఇంటి దగ్గర నుంచి వస్తుండగా గుండె నొప్పితో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన స్వస్థలం ఆళ్లగడ్డ కావడంతో మృతదేహాన్ని ఆళ్లగడ్డకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 15, 2024

నంద్యాల: చిరుత పులి మృతి

image

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని శ్రీశైలం డ్యాం సమీపంలో శనివారం చిరుత పులి మృతిచెందింది. దోమలపెంట రేంజర్ గురుప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువుల దాడిలో ఓ మగ చిరుత పులి మృతిచెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

News June 15, 2024

కర్నూలు: వాము క్వింటా గరిష్ఠ ధర రూ.20,160

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం పంట ఉత్పత్తుల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌కు 104 క్వింటాళ్ల వేరుశనక్కాయల దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.4,929, మధ్యస్థ ధర రూ.6,371, గరిష్ఠ ధర రూ.7,200 పలికింది. 318 క్వింటాళ్ల వాము దిగుబడులు రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.711, మధ్యస్థ ధర రూ.17,501, గరిష్ఠ ధర రూ.20,160 పలికినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు.

News June 15, 2024

కర్నూలు ఆర్‌యూ స్నాతకోత్సవం వాయిదా

image

కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గమనించాలని కోరారు.

News June 15, 2024

కర్నూలు: ఉద్యోగ మేళాలో 64 మంది ఎంపిక

image

నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. సీ.క్యాంపులోని కార్యాలయంలో వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ఇనోవిజన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్, జియో టవర్స్, నవభారత్ ఫర్టిలైజర్స్, అమర్ రాజా కంపెనీల వారు హాజరయ్యారు. మొత్తం 197 మంది హాజరు కాగా.. 64 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు.

News June 15, 2024

కర్నూలు: జత పొట్టేళ్ల ధర రూ.1.10 లక్షలు

image

ముస్లింల బక్రీద్‌ పండగ పురస్కరించుకొని పొట్టేళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా అధికమయ్యాయి. ఆదోని సంతలో శుక్రవారం జత పొట్టేళ్ల ధర ఏకంగా రూ.1.10 లక్షలు పలికింది. వీటిని ఆదోని పట్టణం మేతర్‌ మసీదు ప్రాంతానికి చెందిన ఖాజా, ఖురేషి ఇబ్రహీం కొనుగోలు చేశారు.

News June 15, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త

image

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ప్రతిపక్ష హోదాలో టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ శాఖ మన జిల్లా మంత్రికి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 15, 2024

TTD ఈవోగా ధర్మారెడ్డి తొలగింపు

image

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ధర్మారెడ్డిని టీటీడీ ఈవో పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో YCPకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ధర్మారెడ్డిని ఇటీవలే సీఎస్ నీరభ్ కుమార్ సెలవులపై పంపారు.

News June 15, 2024

శ్రీశైలం: వైభవంగా స్వామి అమ్మవార్లకు ఊయలసేవ

image

శ్రీశైలం దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఊయలసేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేషంగా ప్రతి శుక్రవారం రోజు పౌర్ణమి , మూలానక్షత్రం రోజులలో స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ కార్యక్రమం దేవస్థానం సేవగా నిర్వహిస్తారు. శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు దర్మనం కల్పిస్తారు.

News June 14, 2024

ఫరూక్ మంత్రిగా పనిచేసిన శాఖలివే..!

image

నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ 1985లో తొలిసారి MLAగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు కేబినెట్‌లో చక్కర, వక్ఫ్&ఉర్దూ అకాడమీ శాఖ మంత్రిగా చేశారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత విద్యా, ఉర్దూ అకాడమీ, మున్సిపల్ శాఖలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో మైనారిటీ సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖలు కేటాయించారు.