India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు ఎస్ఐపై దాడి, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థలో విశ్వాసం పెంచాలని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రశ్నించక మానరు అని ఆయన వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా గడివేముల మండల పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని పెసరవాయి-కరిమద్దెల గ్రామాల మధ్య బండి ఆత్మకూరు మండలానికి చెందిన ట్రాక్టర్ కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో వరి నాట్లు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన సునీల్ సర్దార్ (45)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో సైబర్ కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. నకిలీ లింకులు పంపుతూ మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. గతేడాది జిల్లాలో 41 సైబర్ కేసులు నమోదు కాగా.. 2024లో ఆ సంఖ్య 104కు చేరడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో మిగిలిన నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిన సైబర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ మోసాల ఉచ్చులో పడకుండా ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
గతేడాతో పోలిస్తే ఈ సంవత్సరం 35.85 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. పోలీసు శాఖ జిల్లా వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడంతోనే 2024లో నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. జిల్లా పోలీసుల సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు. 2023లో జిల్లాలో 7,877 కేసులు నమోదు కాగా.. 2024లో 5,053 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం కోనేరు హంపీ రికార్డ్ సృష్టించారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖేందర్‌పై ఆమె విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమెకు నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అభినందనలు తెలిపారు. ‘2024 FIDE మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నందుకు కోనేరు హంపీకి అభినందనలు. మీ విజయం కృషికి, దృఢత్వానికి, నిజమైన ఛాంపియన్ స్ఫూర్తికి నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
ప్రతి విద్యార్థి ఆత్మరక్షణ విద్యగా టైక్వాండో సాధన ప్రతిరోజు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతరం సాధన చేస్తే క్రమశిక్షణతో పాటు శారీరక అభివృద్ధి కలుగుతుందన్నారు.
8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు కర్నూలు బీ.క్యాంపులోని టీజీవీ కళ్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జాతీయ రింగ్ పైట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, ప్రభాకర్ హాజరై పోటీలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రాలలో అనేక జాతీయ స్థాయి పోటీలను నిర్విరామంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పోటీల కార్యదర్శి అబ్దుల్లా పాల్గొన్నారు.
కర్నూలులోని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించే దేహదారుడ్య పరీక్షల(ట్రయల్ రన్) రీహర్సల్‌ను ఎస్పీ జి.బిందు మాధవ్ పరిశీలించారు. PMT/PET పరీక్షలను పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కాగా దేహదారుడ్య పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా RFID సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాట్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
నంద్యాల-రేణిగుంట డెమో ట్రైన్ నంబర్ 07284 నుంచి 77211గా మారనుంది. ఉదయం 6 గంటలకు ప్రయాణించే ఈ ట్రైన్ జనవరి ఒకటో తేదీ నుంచి 6:30 నిమిషాలకు బయలుదేరనుంది. అలాగే నంద్యాల – కర్నూలు మధ్య నడిచే డెమో ట్రైన్ నంబర్ 07498 నుంచి 77210గా, కర్నూలు నుంచి తిరుగు ప్రయాణంలో 07499 నుంచి 77209గా మారనుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు నుంచి 5:40కి కాకుండా జనవరి ఒకటో తేదీ నుంచి 5:15 కే ప్రారంభం కానుంది.
ఓర్వకల్లు మండలంలోని కొమ్ముచెరువు అంజన్న ఆలయం వద్ద శివన్న(57) చెట్టుకు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు . స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.