Kurnool

News December 29, 2024

ఓర్వకల్లులో వ్యక్తి సూసైడ్

image

ఓర్వకల్లు మండలంలోని కొమ్ముచెరువు అంజన్న ఆలయం వద్ద శివన్న(57) చెట్టుకు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు . స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.

News December 29, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు ఎస్పీ కీలక సూచన

image

పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అభ్యర్థులకు సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు APSLPRB ఆధ్వర్యంలో APSP బెటాలియన్‌లో PMT/PET పరీక్షలు నిర్వహించనున్నారు.

News December 29, 2024

PGRSను సద్వినియోగం చేసుకోండి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియం నందు ఈ నెల 30న నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఆయా వినతులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

News December 29, 2024

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: మంత్రి బీసీ

image

ప్రజల సహకారం లేకుంటే ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేమని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలంటే వారి సహకారం అవసరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి – ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా మెగా ర్యాలీని నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత బనగానపల్లెగా తీర్చిదిద్దుతామని అన్నారు.

News December 28, 2024

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్

image

కడప మహిళకు కర్నూలులో వైద్యులు అరుదైన ఆపరేషన్ పూర్తి చేశారు. కడపకు చెందిన రమణమ్మ గత కొన్నినెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్షించిన వైద్యులు కిడ్నీ, లివర్‌కు దగ్గరలో రక్తనాళాలు ఆనుకొని 8.సెం.మీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కర్నూలుకు రెఫర్ చేయగా.. యురాలజీ HOD డా. కే. సీతారామయ్య బృందంతో మూడు గంటల పాటు శ్రమించి కణితిని తొలగించినట్లు తెలిపారు. ఆమెను శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

News December 28, 2024

వాటితో నాకేంటి సంబంధం: మాజీ మంత్రి బుగ్గన

image

బేతంచెర్లలో గురువారం అధికారులు పలు గోదాములపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే వాటిలో కొన్ని క్వింటాళ్ల బియ్యం మాయమయ్యాయని, ఆ గోదాములు మాజీ మంత్రి బుగ్గనకు సంబంధించిన వారివిగా గుసగుసలు వినిపించాయి. దానిపై బుగ్గను స్పందిస్తూ .. బంధువులు కొందరు ప్రైవేటు గోడౌన్‌లు నిర్వహిస్తున్న మాట వాస్తవేమని.. అయితే తనకేంటి సంబంధమంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ విచారణలో ఎవరికి చెందినవో బయటకు వస్తాయన్నారు.

News December 28, 2024

జనవరి 1న శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని స్పర్శ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అర్జిత సేవలను కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

News December 28, 2024

అటవీ సంపదను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్ జి.రాజకుమారి 

image

అటవీ సంపదను సంరక్షించుకుంటూ వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పచ్చర్ల ఎకో టూరిజం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధి రాజ్ సింగ్ రాణాతో కలిసి జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు.

News December 27, 2024

వైసీపీకి ఇంతియాజ్ రాజీనామా

image

విశ్రాంత ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మంత్రి టీజీ భరత్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఇంతియాజ్ తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News December 27, 2024

కర్నూలు: 58వ సారి రక్తదానం

image

కర్నూలులోని ఓ ఆసుపత్రిలో హనుమంతు అనే వ్యక్తికి గుండె ఆపరేషన్ చేశారు. ఈక్రమంలో రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సొసైటీని సంప్రదించారు. ఆ సొసైటీ అధ్యక్షుడు గందాలం మణికుమార్ స్పందించారు. 58వ సారి ఆయన రక్తదానం చేశారు. ఈ మేరకు ప్రశంసా పత్రాన్ని అందించారు.