Kurnool

News December 21, 2024

కర్నూలు: కాసేపట్లో.. ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు

image

కర్నూలు జిల్లాలో నేడు ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లెల్సీ, గాజులదిన్నె, తెలుగుగంగ, కేసీకాల్వ, ఎస్సార్‌బీసీ ప్రాజెక్టు కమిటీలకు ఉదయం 9 గంటల నుంచి ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకుంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికల్లో అధ్యక్షులు, డీసీలను ఎన్నుకున్న విషయం తెలిసిందే.

News December 21, 2024

మహానంది ఏపీ మోడల్ స్కూలుకు జాతీయ అవార్డు

image

పర్యావరణం, జీవ వైవిధ్యం పట్ల సున్నితమైన ఆలోచనలను సమాజంలో పెంపొందించే లక్ష్యంతో విప్రో సంస్థ విప్రో ఎర్తియన్ పేరుతో అందించే జాతీయ అవార్డును మహానంది మోడల్ స్కూల్ సొంతం చేసుకుందని ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ద్వారా 1,550కి పైగా వచ్చిన ప్రాజెక్టుల నుంచి తమ పాఠశాల పంపిన జీవ వైవిధ్యం ప్రాజెక్ట్‌కు జాతీయ అవార్డు వరించిందని ఆయన పేర్కొన్నారు.

News December 21, 2024

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏపీ జట్టు

image

ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులో జరిగే జాతీయ స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్‌లో ఏపీ జట్టు పాల్గొంటున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం కర్నూలులో జట్టు క్రీడాకారుల వివరాలు తెలిపారు. జట్టులో సీహెచ్ దేవిక, జీ.దేవి, ఎస్.పుష్ప, సీహెచ్ గాయత్రి, వెంకటలక్ష్మి, ఝాన్సీ, రిషిత, జ్యోతి, హన్సిక, అనన్య, త్రివిధ, లక్ష్మీ, శ్రీవాణి, షాహిదా ఉన్నారన్నారు.

News December 21, 2024

KNL: జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు నిర్దోషులుగా తీర్పు

image

దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన ఆరుగురిని ఓ హత్య కేసులో నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. 2001లో కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడుపై బాంబులతో దాడికి పాల్పడిన ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దాడిచేసిన వారిపై వెంకటప్ప నాయుడు అనుచరులు ప్రతిదాడి చేశారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఆరుగురిని నిర్దోషులుగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

News December 21, 2024

పెన్సిల్ ముక్కపై సూక్ష్మ కళ.. భళా..!

image

నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా పెన్సిల్ ముక్కపై ధ్యానం చేస్తున్న వ్యక్తి, ప్రపంచ భూగోళం సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్‌తో మైక్రో బ్రష్ ద్వారా చిత్రించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించిందన్నారు.

News December 21, 2024

పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: మంత్రి ఫరూక్

image

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల కోర్టు కేసుల పరిష్కారం పై న్యాయశాఖ పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రిఫరూక్ హోం మంత్రి అనిత అధికారులకుసూచించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రత్యేక కోర్టుల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మంత్రి అన్నారు.

News December 21, 2024

రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు పెరుగుతోంది: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోందని కలెక్టర్ రంజిత్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలు నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి NH44 పీడీ హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనపై చర్యలకు డీవో లెటర్ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

News December 20, 2024

రేపు కర్నూలు జిల్లాలో 27 చోట్ల రెవెన్యూ సదస్సులు: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో శనివారం 27 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శుక్రవారం తెలిపారు. ఆదోని డివిజన్లోని కుర్నూరు, పులచింత, రాళ్లదొడ్డి, ఆగశన్నూరు, కగ్గళ్లు, ముచ్చగేరి, ఆరెకల్, మార్లమడికి, కౌతాళం, కర్నూలు రెవెన్యూ డివిజన్లోని కుంతలపాడు, చెట్లమల్లాపురం, సర్పరాజుపురోలో, ఎర్రగుడి, రేమట, పోలకల్లు సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 20, 2024

రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన..!

image

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA సూచించింది.

News December 20, 2024

సిబ్బంది సమస్యల పరిష్కారం కోసమే గ్రీవియన్స్ డే: ఎస్పీ

image

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసమే గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లు ఆయా విభాగాలలో విధులు నిర్వహిస్తున్న 9 మంది సిబ్బంది మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు.