Kurnool

News December 19, 2024

కర్నూలు జిల్లాలో 16 మంది డిబార్

image

కర్నూలు జిల్లాలో 16 మంది డిగ్రీ విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో డిబార్ చేసినట్లు ఇన్‌ఛార్జి వీసీ ఎన్‌టీకే నాయక్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షకు 10,504 మందికి గానూ 9,125 మంది, ఐదో సెమిస్టర్ పరీక్షకు 62 మందికి గానూ 48 మంది హాజరయ్యారు.

News December 19, 2024

ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న కర్నూలు ఎస్పీ

image

కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్‌కు ఉత్తమ ప్రశంసా పత్రం లభించింది. డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఆయన ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. లోక్ అదాలత్‌లో 7,913 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే కర్నూలు పోలీస్ శాఖను మొదటి స్థానంలో నిలపడంతో ఎస్పీని డీజీపీ తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు.

News December 19, 2024

ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నంద్యాలలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా పట్టణ, ట్రాఫిక్ సీఐలు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాల గుర్తింపు సూచిక బోర్డులు, తదితర వాటిని ఏర్పాటు చేశారు.

News December 18, 2024

యువకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

నిరుద్యోగ యువత వివిధ వృత్తి నైపుణ్య రంగాల్లో రాణించేందుకు అవసరమైన ఉపాధి శిక్షణ ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌ జీ.రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాలలో వృత్తి నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

News December 18, 2024

గుండెపోటుతో ఇద్దరు లారీ డ్రైవర్ల మృతి

image

డోన్‌లో కొండపేట ప్రాంతానికి చెందిన గిరిబాబు(45), గోసానిపల్లెకు చెందిన రామాంజనేయులు(45) అనే లారీ డ్రైవర్లు గుండెపోటుతో మృతిచెందారు. డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివరాం బుధవారం వారి స్వగృహాలకు వెళ్లి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వాలు రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

News December 18, 2024

కర్నూలులో వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ జగన్‌

image

కర్నూలులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్‌ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్‌ కె.చతుర, డాక్టర్‌ కె.నిఖిల్‌లకు వివాహా శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కన్వెన్షన్‌ సెంటర్‌లో జగన్ అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అనంతరం జిల్లా నేతలతో ఆయన కాసేపు ముచ్చటించారు.

News December 18, 2024

‘దేవర’ పొట్టేలు.. రూ.1.28 లక్షలు పలికింది!

image

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ‘దేవర’ పొట్టేలు రికార్డు ధర పలికింది. వందగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దేవర పేరు పెట్టి పెంచారు. విక్రయించేందుకు సంతకు తీసుకెళ్లగా రైతులు పోటీ పడ్డారు. ₹20వేలతో మొదలు కాగా చివరికి ₹1.28లక్షలకు పెద్దకడబూరు మండలంలోని బాపులదొడ్డికి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. తమ గ్రామంలో ఈ నెల 25, 26 తేదీలలో జాతర ఉండటంతో ఈ పొట్టేలును కొనుగోలు చేసినట్లు అతడు తెలిపారు.

News December 18, 2024

‘దేవర’ పొట్టేలు.. రూ.1.28 లక్షలు పలికింది!

image

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ‘దేవర’ పొట్టేలు రికార్డు ధర పలికింది. వందగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దేవర పేరు పెట్టి పెంచారు. విక్రయించేందుకు సంతకు తీసుకెళ్లగా రైతులు పోటీ పడ్డారు. ₹20వేలతో మొదలు కాగా చివరికి ₹1.28లక్షలకు పెద్దకడబూరు మండలంలోని బాపులదొడ్డికి చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. తమ గ్రామంలో ఈ నెల 25, 26 తేదీలలో జాతర ఉండటంతో ఈ పొట్టేలును కొనుగోలు చేసినట్లు అతడు తెలిపారు.

News December 18, 2024

మంత్రి బీసీ మరో కీలక నిర్ణయం!

image

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ తనను కలిసేందుకు వచ్చేవారు నోట్ పుస్తకాలు, పెన్నులు మాత్రమే తీసుకురావాలని ఇప్పటికే సూచించారు. ఇప్పుడు ఆ వేడుకలకు సంబంధించి ఎలాంటి బ్యానర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని తన అభిమానులకు తెలియజేశారు. బనగానపల్లెను ప్లాస్టిక్ రహిత, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

News December 18, 2024

కోలుకుంటున్న డోన్ ఎమ్మెల్యే

image

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఆయన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా నిన్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ విషయం తెలియగానే కోట్ల అనుచరులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేశారు.