India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఆయన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా నిన్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ విషయం తెలియగానే కోట్ల అనుచరులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేశారు.
ఎస్సీ, బీసీ ఇతర సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి చేపట్టాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత సంక్షేమ అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామానికి చెందిన రైతు బోయ రాముడు(50) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 4 సంవత్సరాల క్రితం పంటల సాగు కోసం చేసిన రూ.8లక్షల అప్పు తీర్చలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆస్తమా వ్యాధి మందులను అధిక మోతాదులో తీసుకోవడంతో కోలుకోలేక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడి కుమారుడు సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తనను కలిసేందుకు బనగానపల్లెకు వచ్చేవారు ఎలాంటి ఆడంబరాలకు చోటు లేకుండా శాలువాలు, పూలదండలు, పూల బొకేలను తీసుకురావొద్దని ఆయన సూచించారు. కేవలం నోట్ పుస్తకాలు, పెన్నులు మాత్రమే తీసుకురావాలని పిలుపునిచ్చారు. వాటిని విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు కర్నూలుకు రానున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలుకు చేరుకుని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ నేత తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి వెళ్తారు.
తల్లీ, కుమార్తెలను ఆత్మకూరు పోలీసులు కాపాడారు. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన మేరీ, ఈశ్వర్ గొడవ పడగా మేరీ పుట్టింటికి వెళ్లింది. అయినా మరోసారి భార్యాభర్తలు గొడవపడటంతో తన కుమార్తెలు రేణుక, నవీనలను తీసుకుని చనిపోతానని చెప్పి వెళ్లడంతో ఆమె తల్లి, భర్త ఆత్మకూరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా శ్రీశైలంలో ఉన్నట్లు గుర్తించారు. కౌన్సెలింగ్ ఇచ్చి తల్లికి అప్పగించారు.
మీసాలు గడ్డాలు గురించి కాదని, అభివృద్ధిలో పోటీ పడాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నకేశవరెడ్డికి కూడా మీసాలు లేవని ఎద్దేవా చేశారు. 168 టీసీలకు ఎన్నికలు జరిగితే పార్లపల్లిలో చెన్నకేశవరెడ్డి నిరసన చేయటంపై మండిపడ్డారు. కడిమెట్ల గ్రామానికి తాగడానికి నీళ్లు ఇచ్చేది మీసాలు లేని ఎమ్మెల్యే అని హితవు పలికారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 93 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు.
హీరో మంచు మనోజ్, భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. నేడు శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో ఆళ్లగడ్డలోని భూమా ఘాట్‌లో నివాళి అర్పించిన అనంతరం రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఓ పార్టీలో చేరి నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేస్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మనోజ్ దంపతులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.