Nellore

News May 7, 2024

NLR: మా ఇంట్లో ఓట్లు అమ్మాకానికి లేవు..!

image

ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభా పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కొందరు డబ్బు, మరికొందరు విలువైన వస్తువులు అందజేస్తుంటారు. ఇటీవల చాలా మంది ఈ తాయిళాలను తిరస్కరిస్తున్నారు. ఈక్రమంలోనే నెల్లూరులోని పొగతోట, గాంధీనగర్, సంతపేట, స్టోన్ హౌస్ పేట, వేదాయపాలెం, కలెక్టరేట్ పరిసరాల్లో ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మకానికి లేవు, ఓట్లు కొనేవాళ్లు మా ఇంటికి రావద్దు’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

News May 7, 2024

నెల్లూరులో రూ.2.61 కోట్లు సీజ్

image

ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 30 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 16163 మందిని అధికారులు బైండోవర్ చేసుకున్నారు. జిల్లాలోని వివిధ చెక్ పోస్టులతో పాటు పలు ప్రాంతాల్లో కలిపి రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 18470 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

News May 7, 2024

నెల్లూరులో మేనిఫెస్టోల రాజకీయం 

image

నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడూలేని విధంగా కొత్త ఒరవడి మొదలైంది. పార్టీల మేనిఫెస్టోలు కాకుండా అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపకల్పన చేశారు. వైసీపీ నెల్లూరు అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేశారు. నిన్న కోవూరు కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమారెడ్డి, ఎంపీ అభ్యర్థి రాజు మేనిఫెస్టోను ప్రకటించారు. సర్వేపల్లిలోనూ సోమిరెడ్డి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు.

News May 7, 2024

కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా సీట్లు

image

నెల్లూరు పరిధిలోని కొత్తూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ఎస్టీ విభాగంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. ఒకటో తరగతికి సంబంధించిన ఈ సీట్ల కోసం బుధవారం నుంచి మే 15వ తేదీ లోపు కేంద్రీయ విద్యాలయంలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 7, 2024

ఓటు హక్కును వినియోగించుకోండి: కలెక్టర్ హరి నారాయణన్

image

నెల్లూరులో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులందరూ 8వ తేదీలోగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలన్నారు.

News May 6, 2024

వాకాడు బీచ్‌లో యువకుడి గల్లంతు

image

గూడూరుకు చెందిన ఓ యువకుడు వాకాడు మండలంలోని బీచ్‌లో గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద మసీదు వీధిలోని షేక్ షబ్బీర్, మున్ని దంపతుల పెద్ద కుమారుడు అద్నాన్ (16) ఆదివారం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో దిగిన కొద్దిసేపటికి అద్నాన్ గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

ఉదయగిరి మండలంలో అకాల వర్షం

image

ఉదయగిరి మండలం కుర్రపల్లి పరిసర ప్రాంతాలలో ఉరుముల మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. మూడు నెలల నుంచి కాస్తున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోయారు. అధిక ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈవర్షంతో కొంత ఉపశమనం కలిగింది.

News May 6, 2024

నెల్లూరు: సజ్జల సమక్షంలో వైసీపీలో చేరికలు

image

కోట మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఉత్తమ నెల్లూరుకు చెందిన దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, కర్లపూడికి చెందిన దువ్వూరు మోహన్ రెడ్డి, గూడూరుకు చెందిన చింతంరెడ్డి కృష్ణారెడ్డి విజయవాడలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

News May 6, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

సోమవారం ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజిలో రెండోరోజు కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అవకాశం ఉందన్నారు. అనంతరం ఉదయగిరి సమీకృత ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల కమిషనింగ్ ను సందర్శించారు.

News May 6, 2024

ఉదయగిరి నుంచి తొలిసారి మహిళ పోటీ

image

ఉదయగిరి నుంచి ఎందరో పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఏ పార్టీ కూడా మహిళలు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఉదయగిరి నుంచి ఈసారి 16మంది బరిలో ఉండగా.. తొలిసారి BSP నుంచి క్రాకుటూరి పుష్పాంజలి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నుంచి కాకర్ల సురేశ్ పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 2,41,861 మంది ఉండగా, వారిలో పురుషులు 1,20,108 మంది, మహిళలు 1,21,743 మంది ఉన్నారు.