India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్వహణ పనుల నిమిత్తం పలు మెము రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ నుంచి గూడూరుకు వచ్చే 07500, 12744 రైళ్లు ఈ నెల 15 నుంచి 30 వరకు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458, 12743 రైళ్లు ఈనెల 16 నుంచి 31 వరకు రద్దయ్యాయి. గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 17259, విజయవాడ నుంచి గూడూరు వెళ్లే 17260 రైళ్లను 16, 23, 30 తేదీలలో నిలిపివేసినట్లు తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ ఈఓ సెల్విని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో కొన్ని రకాల ఉద్యోగోన్నతుల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన గత నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. దీంతో ఈఓపై సస్పెన్షన్ వేటు పడింది.
భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారం చేసిన ఘటన టీపీ గూడూరులో జరిగింది. పోలీసుల వివరాలు.. టీపీ గూడూరుకు చెందిన మహిళకు ఇదివరకే వివాహమవ్వగా ఆమెకు కూతురు, కొడుకు ఉన్నారు. భర్తతో విభేదాలు వచ్చి కనిగిరికి చెందిన కె.మల్లిఖార్జునను చేసుకుంది. వీరికి కూడా గొడవలు రావడంతో జూన్ 29న స్కూలుకు వెళ్లి.. దుస్తులు కొనిస్తానని భార్య కుమార్తెను బైకుపై బల్లిపల్లి అడవిలోకి తీసుకువెళ్లాడు. రెండురోజుల పాటు అత్యాచారం చేశాడు.
నెల్లూరు జిల్లాలోని కుక్కలకు ఉచితంగా వేసేందుకు 33 వేల యాంటీ రేబిస్ టీకాలను సిద్ధం చేసినట్లు జిల్లా పశుసంవర్థక శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీటిని వేయనున్నట్లు తెలిపింది. అన్ని పశు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలి క్లినిక్‌లలో వీటిని వేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
ఉదయగిరి అటవీ రేంజి పరిధిలోని అడవుల్లోకి ప్రజలు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆ శాఖ జిల్లా అధికారులు తాజాగా వెలుగొండ అడవుల్లో రెండు పులులు సంచరిస్తున్నాయని నిర్ధారించడంతో సమీప ప్రాంతాల ప్రజలుఆందోళన చెందుతున్నారు. వెలుగొండ అడవులు రాపూర్ వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో పశువుల కాపరులు అడవుల్లోకి నిత్యం వెళుతుంటారు. పులుల సంచారంతో అడవుల వైపు కన్నెత్తి చూడడం లేదు.
గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు3 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మెమూ, ఆగస్టు 4-11 వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5-10 వరకు చెన్నై సెంట్రల్-విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. గురువారం నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతంగా జరిగిందని వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పర్యటనతో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.మళ్లీ వైసీపీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్ఛం అందచేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు.. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డీఈఓ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. nationalawards toteachers. education. gov. in వెబ్‌సైట్‌లో ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఈవో సూచించారు.
అనంతసాగరం మండలం, చిలకలమర్రి గ్రామానికి చెందిన డబ్బుకుంట శీనయ్య అనే కౌలు రైతు పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. బుధవారం రాత్రి నీళ్లు వదిలేందుకు పొలానికి వెళ్ళగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.