Nellore

News July 5, 2024

నెల్లూరు జిల్లాలో పెద్దపులి సంచారం!

image

నెల్లూరు జిల్లాలో మొదటిసారి పెద్దపులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మర్రిపాడు మండలం వెలుగొండ అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి, చిరుతపులి సంచారం కనిపించినట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అడవుల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

News July 5, 2024

నేడు నెల్లూరులోనే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు, విజ్ఞాపనలు స్వీకరిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయ ప్రతినిధులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

News July 4, 2024

నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య

image

నెల్లూరు రూరల్ రామకోటయ్య నగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నీతురాజ్ (23) అనే వ్యక్తిని గొంతు కోసి నడి రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. దీంతో నీతూరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి రామకోటయ్య నగర్‌ సుజాత రావు కాంప్లెక్స్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2024

రోడ్డు ప్రమాదంలో వరికుంటపాడు MEOకి గాయాలు

image

ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద జాతీయ రహదారిపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వరికుంటపాడు మండల విద్యా శాఖా ధికారి షావుద్దీన్ కి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన ఎంఈఓను వేరే వాహనంలో ఆసుపత్రి తరలించారు. విధులు నిర్వహించుకొని తిరిగి కనిగిరిలోనే తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

News July 4, 2024

నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఓ.ఆనంద్ గురువారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ కలెక్టర్ విద్యాధరి, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ పద్మావతి స్వాగతం పలికారు. అనంతరం ఆయన అల్లూరు సీతారామ రాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News July 4, 2024

వెలుగొండ అడవుల్లో రెండు పులులు: డీఎఫ్ఓ చంద్రశేఖర్

image

ఇటీవల వెలుగొండ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలలో రెండు పులులను గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. ఈ పులులు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెలుగొండ అటవీ ప్రాంతాలకు వచ్చినట్లు గుర్తించారు. పులుల సంచారంతో పొంచి ఉన్న ప్రమాదకర పరిస్థితుల దృష్యా పశువులు, మేకలు, గొర్రెల కాపరులు అడవిలో వెళ్లద్దన్నారు.

News July 4, 2024

తెలంగాణలో నెల్లూరు యువకుడి మృతి

image

ఏఎస్ పేట మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు (36) మంగళవారం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. వెంకట్రావు మంగళవారం మరో ఇద్దరితో కలిసి బైక్‌పై వెళుతుండగా మర్రిగూడ మండలం, తమ్మిడిపల్లి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి సమాధిని ఢీకొంది. ఘటనలో బాలరాజు అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట్రావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి.

News July 4, 2024

నేడు నెల్లూరు కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

image

జిల్లాకు ఇటీవల నూతంగా నియమితులైన కొత్త కలెక్టర్ ఒ.ఆనంద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటులో వేగం పుంజుకోన్నట్లు పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. రాయపట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, ఉక్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ పరిశ్రమల పనుల్లో వేగం పెరగనున్నట్లు పలువురు ఆశిస్తున్నారు.

News July 4, 2024

నేడు మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన వివరాలు..

image

మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు రానున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.

News July 4, 2024

నెల్లూరుకు చేరుకున్న కొత్త కలెక్టర్

image

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ నియమితులైన ఓ. ఆనంద్ బుధవారం విజయవాడ నుంచి నెల్లూరు చేరుకున్నారు. ఆయనకు చింతారెడ్డి పాలెం హైవే వద్ద నెల్లూరు రూరల్ తహసీల్దార్ సుబ్బారెడ్డి పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. గురువారం కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు.