India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఓ.ఆనంద్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన నెల్లూరు కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కావలి వద్ద స్కూల్ బస్సును లారీ ఢీకొనడంతో 15 మంది చిన్నారులు గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో క్లీనర్ మృతి చెందడం బాధాకరమని, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి DM&HO నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నానన్నారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించాను.
కావలి సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొనడంతో ఒకరు <<13549405>>చనిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. క్లీనర్ చనిపోవడం బాధాకరం. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించా. స్కూలు యాజమాన్యాలు బస్సులను కండీషన్‌లో ఉంచుకోవాలి. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు మెడికల్ కాలేజీ భవనంపై నుంచి దూకి డాక్టర్ జ్యోతి(38) నిన్న <<13545642>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. నల్గొండకు చెందిన ఆమెకు నెల్లూరుకు చెందిన రవితో 2014లో వివాహమైంది. వీరికి మూడేళ్ల పాప ఉంది. రవి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్. చేజర్ల మండలంలో పని చేసే జ్యోతి శిక్షణ కోసం నెల్లూరుకు వచ్చారు. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్న ఆమె.. భోజనం తర్వాత వచ్చిన కాల్ మాట్లాడి సూసైడ్ చేసుకున్నారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కేసు వివరాలను తెలుసుకున్నారు. మాజీ మంత్రులు మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.
ఓ ప్రభుత్వ భవనంపై మాజీ CM జగన్ ఫొటో ఇంకా ఉంచడంపై టీడీపీ MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ విజమూరు మండలం గుండెమడకల గ్రామంలో పింఛన్ల పంపిణీకి వెళ్లారు. స్థానికంగా ఉన్న హెల్త్ కేర్ సెంటర్ భవనం వద్ద జగన్ ఫొటో కనపడింది. దీంతో ఆయన మెడికల్ ఆఫీసర్‌కు కాల్ చేశారు. ‘ఏంటి సార్ ఇంకా ప్రభుత్వం మారలేదా? మీకు తెలియదా?’ అని అసహనం వ్యక్తం చేశారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో డయేరియా ప్రబలకుండా అన్ని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డయేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్లను వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
కోవూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కే.రమేష్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ ఆఫీస్ నుంచి కోవూరు డివిజన్‌కు బదిలీ అయ్యారు. కోవూరు డివిజన్లో పనిచేస్తున్న కే.విజయ్ కుమార్ ఆదివారం పదవి విరమణ చేశారు.
దుత్తలూరు మండలం వైసీపీ సీనియర్ నాయకుడు లెక్కల మాలకొండ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌ని కలిశారు. ఈ విషయం ఉదయగిరి నియోజకవర్గంలోని వైసీపీ నాయకుల్లో తీవ్ర దుమారం రేపింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75 వ జన్మదిన వేడుకలకు సత్య కుమార్ రావడంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని మాలకొండ రెడ్డి వర్గం అంటుంది. కానీ దీనిని కొందరు వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
నెల్లూరు నగరంలోని GGH హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ నాలుగో అంతస్తు నుంచి దూకి జ్యోతి అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. చేజర్ల మండలం చిత్తలూరు PHCలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జ్యోతి మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.