India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మందా రాణిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడును విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో ఆమెను మాతృ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విశాఖపట్నానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నెల్లూరు నగర ట్రాఫిక్ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు గత ఏడాది మొత్తం 883 ప్రమాదాలు జరగగా ..998మంది క్షతగాత్రులయ్యారు, 408మంది మృతి చెందారు. వీటిలో ఎక్కువగా తలకు బలమైన గాయాలు కావడం వల్లే మృతి చెందినట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులు పూర్తి స్థాయిలో హెల్మెట్ ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరమ్మతుల నిర్వహణ కోసం కొండాయపాళెం రైల్వేగేటును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 3వ తేదీ వరకు ఆ మార్గంలో రాకపోకలు జరగవని సూచించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని ..అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు జిల్లాలో మిస్సింగ్ కేసులపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆరీఫ్ హఫిజ్ సూచించారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత కేసుల గురించి తెలుసుకున్నారు. సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక బృందాలతో మిస్సింగ్ కేసులను చేధించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్‌ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో లోక్‌సభ ఎంపీలతో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్‌కు వేమిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. పలు అంశాలపై చర్చించారు.
నెల్లూరు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరులోని ఆయన కార్యాలయంలో కలిశారు. జిల్లాలో టీటీసీ చేసిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారని చెప్పారు. రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెరిగేలా చూడాలని కోరారు.
జులై 1 నుంచి అమలు చేయాలనుకుంటున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాలను వాయిదా వేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో లాయర్లు నిరసన తెలిపారు. సీనియర్ లాయర్లు జక్కా శేషమ్మ, DSV ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్త చట్టాల కారణంగా IPC 1973, భారతీయ శిక్షాస్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872 రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా DSC ద్వారా 651 ఖాళీలు భర్తీ చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఇలా..
➤ పీడీలు: 107 ➤ బయాలజీ: 19
➤ ఇంగ్లిష్: 56 ➤ హిందీ: 38 ➤ గణితం: 60
➤ ఫిజిక్స్: 52 ➤ సోషల్ స్టడీస్: 38
➤ సంస్కృతం: 3 ➤ తెలుగు: 32
➤ ఎస్జీటీ తెలుగు: 182 ➤ ఎస్జీటీ ఉర్దూ: 11
➤ సైన్స్: 23
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలిచారని ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆనం నివాసంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష నేత హోదా రాదన్నారు.
నెల్లూరు ఐటీడీఏ పీవో మందా రాణిపై జడ్పీ సీఈవో కన్నమనాయుడును విచారణ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి పీవోపై ఫిర్యాదు చేసిన గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్యను విచారించారు. పీవో అవినీతి నిధులు దుర్వినియోగంపై విచారించి శాఖ పరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.