Nellore

News April 10, 2024

వింజమూరు: ఏఆర్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

image

వింజమూరు మండలం చాకలికొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణపై కేసు నమోదైంది. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు ఏఆర్ కానిస్టేబుల్ పై వింజమూరు పోలీస్టేషన్లో ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనను అందరు తప్పక పాటించాలని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది.

News April 10, 2024

నెల్లూరు: ‘డేరింగ్ అండ్ డాషింగ్’ మూవీ టీం పూజలు

image

నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ మూవీ టీమ్ తమ చిత్రం విజయవంతంగా పూర్తయి విజయం సాధించాలని పూజలు నిర్వహించారు. 25 కళాశాల అధ్యక్షులు, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా.. వైభవంగా జరిగాయి. హీరోగా శ్రీరామ్, హీరోయిన్ గా మిధున ప్రియ వ్యవహరిస్తుండగా కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు.

News April 10, 2024

సైబర్ క్రైమ్ కేసులో నిందితులుగా నెల్లూరురోళ్లు

image

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టిపుటూరుకు చెందిన అనూషా సైబర్ మోసానికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి వివిధ దశల్లో రూ.20 లక్షలను సైబర్ నేరస్తులు లాగేశారు. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నెల్లూరు శోధన్ నగర్‌కు చెందిన డి.జగదీశ్, సంతోశ్, వెంకటగిరి మండలం వల్లివేడుకు చెందిన సురేశ్, కార్వేటినగరానికి చెందిన మునీంద్ర ఉన్నారు.

News April 10, 2024

ఆరు సార్లు ఎంపీ… మరోసారి బరిలోకి

image

తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత చింతామోహన్ దే. 1984లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 1989, 1991, 1998, 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి లోక్ సభలో ప్రవేశించారు. కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు.

News April 10, 2024

నెల్లూరు: రూ.2.70 లక్షలు స్వాధీనం

image

ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.2.70 లక్షల నగదును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పట్టుకున్నారు. వేదాయపాలెం, కొడవలూరు, కావలి ఒకటో పట్టణం, గ్రామీణం, జలదంకి, చేజర్ల, మర్రిపాడు, కలువాయి, సైదాపురం పరిధిలో 196 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ తెలియజేశారు

News April 10, 2024

నెల్లూరు: పెట్రోల్ తాగి బాలుడి మృతి

image

పెట్రోల్ తాగి అస్వస్థతకు లోనైన రెండేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. నెల్లూరు నగరంలోని ఇరుగాళ్లమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా దంపతుల కుమారుడు కాలేషా.. ఈ నెల 7వ తేదీ సాయంత్రం వాటర్ బాటిల్లో అడుగున ఉన్న పెట్రోల్ ను తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.

News April 10, 2024

ఆత్మకూరులో వైసీపీకి భారీ షాక్

image

ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, రావులకొల్లు సర్పంచి రామిరెడ్డి మోహన్‌రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. నెల్లూరులోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో టీడీపీలో చేరారు. వారికి వేమిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

News April 9, 2024

నెల్లూరు MP అభ్యర్థిగా రాజు

image

కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు పేరు ఖరారైంది. గతంలో ఆయన జాతీయ ఎస్సీ, ఎస్టీ సెల్ చైర్మన్‌గా పని చేశారు. రాహుల్ గాంధీ అంతరంగికుడిగా కీలకంగా వ్యవహరించారు. దీంతో నెల్లూరు ఎంపీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు.

News April 9, 2024

నెల్లూరు, తిరుపతిలో ఒకేలా ప్రజాతీర్పు

image

నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మూడు దశాబ్దాలుగా ప్రజా తీర్పు ఒకేలా ఉంటోంది. 1989, 91, 96, 98లో రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. 1999లో నెల్లూరులో టీడీపీ, తిరుపతి ఎంపీగా టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో.

News April 9, 2024

నెల్లూరు సిటీ బీసీవై పార్టీ అభ్యర్థిగా చెంచు మహేశ్

image

భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా కాళహస్తి చెంచు మహేశ్ బరిలో నిలవబోతున్నారు. ఈ మేరకు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో నెల్లూరు సిటీ అభ్యర్ధిగా చెంచు మహేశ్‌ను ప్రకటించారు.