India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 10 స్థానాల్లో గెలిచింది. వీరిలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణకు (72,489) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (7,576) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణకు ఇది తొలి విజయం.
నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు. గెలిచిన పది మందిలో ఇద్దరు మహిళలు కాగా.. తొలిసారి వీరు అధ్యక్షా.. అననుండడం విశేషం.
వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయసాయి రెడ్డికి ఘోర పరాభావం ఎదురైన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన 2,45,902 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. వీళ్లద్దరూ ఒకప్పుడు రాజ్యసభలో సహచర ఎంపీలుగా మెలిగారు. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి పదవీ కాలం పూర్తయి పోయింది. సో.. విజయసాయి రెడ్డి ఓడిపోయినా సరే ఎంపీగానే కొనసాగుతారు.
కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు బరిలో దిగారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన దారుణంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 54,844 ఓట్లే వచ్చాయి. దీంతో ఆయన మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు నోటాకు 15,577 ఓట్లు పడ్డాయి. కాగా రాజు 1988 నుంచి 1992 వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో YCPని వీడిన వారంతా TDP, జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. ఒక్క వరప్రసాద్‌కే ఆ అదృష్టం దక్కలేదు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన గూడూరు MLAగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఈక్రమంలో ఆయన BJPలో చేరి తిరుపతి పార్లమెంట్ టికెట్ సంపాదించారు. దీని పరిధిలోని 7 చోట్లా కూటమి అభ్యర్థులు గెలిచినా.. క్రాస్ ఓట్ కారణంగా వరప్రసాద్ గట్టెక్కలేకపోయారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. దీంతో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(DCCB) ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ తన పదవికి రిజైన్ చేశారు. ఎస్సీ రిజర్వ్ అయిన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక నేతగా వ్యహరించారు. జగన్‌తోనూ ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. మరోవైపు అక్కడ గెలిచిన తొలి ఎమ్మెల్యే రికార్డును తన బుట్టలో వేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ 14 సార్లు సాధారణ, ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఓ ఏ ఒక్క మహిళకూ ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే అవకాశం రాలేదు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రశాంతి రెడ్డి 54, 583 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు.
శాసనసభ ఎన్నికల బరిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. 1999 ఎన్నికల్లో అల్లూరు ఎమ్మెల్యేగా, 2004, 2009 ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదాల 2019లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇదే ఆయనకు తొలి ఓటమి.
నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2,45,902 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీచేసిన విజయసాయిరెడ్డికి 5,20,300 ఓట్లు రాగా.. వేమిరెడ్డికి 7,66,202 ఓట్లు వచ్చాయి.
సర్వేపల్లి ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన మెజార్టీ రికార్డును తానే తిరగరాశారు. 1994లో 33,775 ఓట్లు, 1999లో 16,032 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ఆ స్థాయిలో మెజార్టీ ఎవరికీ రాలేదు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన 16,288కి పైగా ఓట్లతో గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.