Nellore

News April 6, 2024

కావలి: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసిన సీఎం

image

కావలిలో శనివారం జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, అబ్దుల్ ఖలీల్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, మధుసూదన్ యాదవ్ లను ఆశీర్వదించాలని కోరారు.

News April 6, 2024

నెల్లూరు: CM జగన్‌ని కలిసిన జబర్దస్త్ ఫేమ్ రియాజ్

image

నెల్లూరు పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం జబర్దస్త్ ఫేమ్ రియాజ్ కలిశారు. పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ జగన్‌ను కలిశారు. కాగా రియాజ్ వైసీపీ దివ్యాంగుల నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రియాజ్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

News April 6, 2024

నెల్లూరు: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ

image

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ సీట్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో బయటకి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

నెల్లూరు జిల్లాలో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర

image

నెల్లూరు జిల్లాలో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న బస్సు యాత్ర కోవూరు క్రాస్ రోడ్, సున్నపుబట్టి,తిప్ప, గౌరవరం మీదుగా ఆరేస్సార్ ఇంటర్నేషనల్ వద్దకు చేరుకొని కొద్దిసేపు భోజన విరామం ఉంటుంది. అనంతరం కావలి పరిధిలోని జాతీయ రహదారి వద్దకు చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

News April 5, 2024

ఆ నలుగురే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం

image

సీఎం జగన్ గురువారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. శనివారం ఉదయం వరకు ఇక్కడే ఉండనున్న జగన్ ఉమ్మడి నెల్లూరుతో పాటు కందుకూరు కలిపి 11/11 సీట్లలో విజయంపై జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వేమిరెడ్డి దంపతులతో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసే స్థానాలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే.

News April 5, 2024

రాజకీయ పరిస్థితులపై జగన్ ఆరా

image

మేమంతా సిద్ధం సభల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చంద్రశేఖర్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంపై ఆయనకు దిశానిర్దేశం చేశారు.

News April 5, 2024

ప్రచారంలో విజయసాయి రెడ్డి సతీమణి

image

సార్వత్రిక ఎన్నికల పోరును అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు మించి ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. రాజకీయాలకు పరిచయమే లేని తమ కుటుంబ సభ్యులను కూడా అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దించేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు అభ్యర్థుల వారసులు ప్రచార పర్వంలో ఉండగా, తాజాగా వైసీపీ MP అభ్యర్థి విజయసాయి రెడ్డి భార్య సునంద కూడా నెల్లూరులో ప్రచారం చేస్తున్నారు.

News April 5, 2024

నెల్లూరు: CM జగన్ ఏం చెప్పనున్నారు?

image

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఒకప్పుడు CM జగన్‌కు నమ్మిన వ్యక్తులు. వీళ్లంతా TDP గూటికి చేరారు. ఇందులో వేమిరెడ్డి, కోటంరెడ్డి YCP అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నెల్లూరుకు వచ్చారు. ఇవాళ అంతా ఆయన నెల్లూరులోనే ఉంటారు. మరి ఆయా నేతలను ఎదుర్కొనేలా జగన్ ఆ పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి.

News April 5, 2024

నెల్లూరు: న్యాయమూర్తుల బదిలీ

image

నెల్లూరు ప్రత్యేక ఏసీబీ కోర్టు, రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. కడపలో పనిచేస్తున్న గీతను నెల్లూరు ప్రత్యేక మహిళా కోర్టు, 8వ అదనపు సెషన్స్ జడ్జిగా నియమించారు. నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మీనారాయణను గుడివాడకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో చిత్తూరు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న కరుణకుమార్ నియమితులయ్యారు.

News April 5, 2024

బాధ్యతలు స్వీకరించిన నెల్లూరు ఎస్పీ

image

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. వారు ఎప్పుడైనా తనను నిర్భయంగా కలవవచ్చని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. నూతన ఎస్పీగా గురువారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆరిఫ్ హఫీజ్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలి పోస్టింగ్‌లో నర్సీపట్నం ఏఎస్పీగా, అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా పని చేశారు.