Nellore

News April 5, 2024

‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు అన్ని అంశాలపై అవగాహన’

image

నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు ఎన్నికల శిక్షణా తరగతుల నిర్వహణతో అన్ని అంశాల్లో అవగాహన కల్పించామని రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, నెల్లూరు నగరంలోని స్థానిక డి.కె. మహిళా కళాశాలలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణలో అన్ని అంశాలపట్ల ఉత్తమ తర్ఫీదు ఇచ్చామని, సందేహాలకు తావులేకుండా మాస్టర్ ట్రైనర్స్ వివరించారని తెలిపారు.

News April 4, 2024

పోలింగ్ నిర్వహణకు 14,945 మంది సిబ్బంది

image

నెల్లూరు జిల్లాలో పోలింగ్ నిర్వహణకు 14, 945 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో ఎన్నికల పోలింగ్ అధికారులను కేటాయించడానికి మొదటి విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. 2, 900 మంది పోలింగ్ అధికారులు, 2,914 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 9,131 మంది ఇతర పోలింగ్ అధికారులు అని తెలిపారు.

News April 4, 2024

మాజీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

image

రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2018 ఏప్రిల్ 3న ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా అనేక అంశాలు, సమస్యలపై రాజ్యసభలో గళం వినిపించారు. ప్యానల్ వైస్ ఛైర్మన్‌గా సభను కూడా నడిపించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు.

News April 4, 2024

నాయుడుపేటలో ముగిసిన జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ

image

నాయుడుపేటలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తిరుపతి జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు నెల్లూరు చింతారెడ్డిపాలెం వద్ద బస చేస్తారు.

News April 4, 2024

నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్ నియామకం

image

నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎస్పీగా ఆరిఫ్ ఆఫీజ్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 8 గంటల లోపల బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది గుంటూరు ఎస్పీగా విధులు నిర్వహించి ఉన్నారు.

News April 4, 2024

నెల్లూరు: ఈనెల 14 వరకు అవకాశం

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 20,44,815 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా చిన్న తప్పులుంటే ఎన్నికల సంఘం సూచించిన 10 గుర్తింపు కార్డుల్లో దేన్నైనా చూపి ఓటు వేయవచ్చన్నారు.

News April 4, 2024

గూడూరులో రోడ్డు ప్రమాదం

image

గూడూరు బైపాస్ కూడలిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే అతను మృతిచెందాడు. మృతుడు గూడూరు మండలం పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి ఏడుకొండలుగా గుర్తించారు. వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగించే అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

News April 4, 2024

నెల్లూరు: నేటి నుంచి ఒక్కపూట అంగన్వాడీ

image

రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఒంటి పూట నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని పీడీ ఆదేశించారు.

News April 4, 2024

తూర్పు కనుపూరులో భక్తుల సందడి

image

తిరుపతి: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ కొలువైన ముత్యాలమ్మ అమ్మవారి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం భక్తుల తాకిడి పెరిగింది. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మరో రెండు రోజులపాటు జాతర నిర్వహించనున్నారు.

News April 3, 2024

రేపు నాయుడుపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

image

తిరుపతి: నాయుడుపేటలో రేపు ‘మేమంతా సిద్ధం’ సబ జరగనుండడంతో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు నాయుడుపేట సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నర్సారెడ్డి కండ్రిగ NH -16 సమీపంలో రేపు సాయంత్రం సభ జరగనుండటంతో నెల్లూరు వైపు నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు గూడూరు జంక్షన్ నుంచి వయా గూడూరు టౌన్ మీదుగా మళ్లించినట్లు తెలిపారు.