Nellore

News June 2, 2024

కావలిలో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల మృతి

image

భార్య మరణం తట్టుకోలేక భర్త కూడా మరణించిన ఘటన కావలి పట్టణంలో చోటు చేసుకుంది. కావలి పట్టణం వైకుంఠాపురం అనపగుంత సమీపంలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు(71) వరలక్ష్మి (65)భార్య భర్తలు. జ్వరంతో బాధపడుతూ వరలక్ష్మి మృతి చెందగా ఆమె మరణ వార్తను తట్టుకోలేక భర్త శ్రీనివాసరావు కూడా మృతిచెందాడు. ఈ దంపతుల మృతదేహాలు పక్కపక్కనబెట్టి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టారు.

News June 2, 2024

EXIT POLLS: ఉమ్మడి నెల్లూరులో బిగ్ ఫైట్ !

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టప్ ఫైట్ నెలకొందని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో కూటమి 2సీట్లు, వైసీపీ 2 సీట్లు గెలుస్తుందని, ఆరు చోట్ల టఫ్ పైట్ ఉందని పేర్కొంది. అందులో రెండు చోట్ల టీడీపీ, మూడు చోట్ల వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలిపింది. మరో స్థానంలో రెండు పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడిచినట్లు వివరించింది. ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

కౌంటింగ్ కేంద్రం చుట్టూ పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు: ఎస్పీ

image

నెల్లూర్ రూరల్ కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ చుట్టూ భద్రతా ఏర్పాట్లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, బారికేడ్ల ఏర్పాట్లు, కనుపర్తిపాడు ZP హైస్కూల్ లో పార్టీ అభ్యర్థులు, నేతల పార్కింగ్ ప్రాంతాలను స్వయంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా మూడంచెల భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు

News June 1, 2024

మరో సర్వే: నెల్లూరులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లకు గాను కూటమి 6-7 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే వెల్లడించింది. వైసీపీ 3-4 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గానూ 106-119 కూటమి, 56-69 సీట్లు వైసీపీ గెలుస్తుందని పేర్కొంది.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్.. నెల్లూరులో కూటమికే ఎక్కువ సీట్లు!

image

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి నెల్లూరులో ఎన్డీఏ కూటమికి 5-7, వైసీపీకి 3-5 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు నెల్లూరు ఎంపీ స్థానంలో టీడీపీ గెలుస్తుందని, తిరుపతిలో వైసీపీ, కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది. దీంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొనగా.. జూన్ 4న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

News June 1, 2024

చాణక్య ..: నెల్లూరు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు గాను కూటమి 7, వైసీపీ 2, ఒకచోట టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.

News June 1, 2024

కేకే ..: నెల్లూరు జిల్లాలో టీడీపీకి 8 సీట్లు!

image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కేకే సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు గాను కూటమికి 8, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి

News June 1, 2024

కాకాణి గెలుపు.. విజయసాయిరెడ్డి ఓటమి: ఆరా

image

సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితాన్ని ప్రకటించింది. అదేవిధంగా వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన వి.విజయసాయిరెడ్డి ఓడిపోతారని అంచనా వేసింది.

News June 1, 2024

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ

image

దేశవ్యాప్తంగా 7వ విడత పోలింగ్ ఇవాళ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలో సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ పై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కోసం నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా మరో మూడు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి.

News June 1, 2024

కౌంటింగ్ కేంద్రం చుట్టూ పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు: ఎస్పీ

image

నెల్లూర్ రూరల్ కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ చుట్టూ భద్రతా ఏర్పాట్లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, బారికేడ్ల ఏర్పాట్లు, కనుపర్తిపాడు ZP హైస్కూల్ లో పార్టీ అభ్యర్థులు, నేతల పార్కింగ్ ప్రాంతాలను స్వయంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా మూడంచెల భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు