Nellore

News April 1, 2024

నెల్లూరు: ఎల్లుండి నుంచి పెన్షన్లు పంపిణీ

image

వాలంటీర్ల నుంచి సిమ్ కార్డులు, ఫోన్లు వెంటనే స్వాధీనం చేసుకోవాలని నెల్లూరు జడ్పీ సీఈవో కన్నమ నాయుడు ఆదేశించారు. ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బుధవారం నుంచి సచివాలయం వద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

News April 1, 2024

గూడూరు: టీచర్ మృతి

image

రైలు కిందపడి టీచర్ మృతిచెందిన ఘటన గూడూరులో వెలుగు చూసింది. గూడూరు మండలం వెందోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్ కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్‌లో చెన్నై మెమూ రైలు దిగుతుండగా ప్రమాదశావత్తు జారిపడిపోయారు. రైలు కింద పడిపోవడంతో చనిపోయారని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 1, 2024

YCP తొలి MLA ప్రసన్న కుమార్..!

image

కాంగ్రెస్‌తో విభేదించిన జగన్ YCPని స్థాపించారు. అదే పార్టీ నుంచి జగన్ కంటే ముందే నెల్లూరులో ఒకరు MLAగా గెలిచారు. ఆయనే ప్రసన్న కుమార్ రెడ్డి. 2009లో TDP కోవూరు MLAగా గెలిచిన ఆయన జగన్ పార్టీలో చేరారు. దీంతో 2012 మార్చిలో ఉప ఎన్నిక జరగ్గా YCP తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో YCP నెల్లూరు MPగా మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు మరో 14 మంది వైసీపీ MLAలుగా గెలిచారు.

News April 1, 2024

NLR: వైసీపీ ప్రచారంలో టీచర్..?

image

జిల్లాలోని వరికుంటపాడు మండలం రామదేవులపాడులో జరిగిన వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ టీచర్ పాల్గొన్నారు. వింజమూరు మండలం నందిగుంట ఎంపీయూపీ పాఠశాలలో మోహన్ రెడ్డి టీచర్‌గా పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.

News April 1, 2024

వేమిరెడ్డికి 5 లక్షల మెజారిటీ: కేతంరెడ్డి

image

నెల్లూరు సిటీ 53వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 5 లక్షల మెజారిటీ, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణకు లక్ష మెజారిటీ వస్తుందన్నారు. వైసీపీ మేనిఫెస్టోకు ధీటుగా కూటమి మేనిఫెస్టో అన్నీ వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందన్నారు.

News March 31, 2024

చంద్రబాబు వృద్ధుల ద్రోహి: VSR

image

ఒకటో తేదీన వృద్ధులకు పింఛన్ అందకుండా చేసిన ద్రోహి చంద్రబాబు అని వైసీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) మండిపడ్డారు. నెల్లూరు 5వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లో హైవే అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరుకు చుట్టపు చూపునకు వస్తున్న నారాయణకు వ్యతిరేకంగా ఓటు వేసి నెల్లూరు ప్రజల సత్తా చూపించాలన్నారు.

News March 31, 2024

గంజాయి మత్తులో యువకుడిపై దాడి

image

నాయుడుపేటలో గంజాయి మత్తులో యువకుడిపై ఆదివారం దాడి జరిగింది. ఓజిలి మండలం గ్రద్దగుంట, నాయుడుపేట మండలం విన్నమాలకు చెందిన కొందరు బీడీకాలనీలో గంజాయి తాగారు. ఈక్రమంలో వారి మధ్య ఘర్షన జరిగింది. మత్తులో గ్రద్దగుంట యువకుడిపై విన్నమాల యువకుడు దాడి చేశాడు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

News March 31, 2024

REWIND: నెల్లూరు జిల్లాలో ఇద్దరు CMలు

image

బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన బెజవాడ గోపాల రెడ్డి మద్రాసు రాష్ట్రంలోనే మంత్రిగా పని చేశారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడటంతో 1955లో ఆయన CMగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడగా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే వాకాడుకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 డిసెంబర్ 17న CMగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం 297 రోజులు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
#ELECTIONS2024

News March 31, 2024

నెల్లూరు: వేసవిలో మండుతున్న పుచ్చకాయ ధరలు

image

జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఉపసమనం పొందేందుకు పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న వ్యాపారులు కిలో 25 రూపాయలు చొప్పున కాయ సైజును బట్టి  రూ.100 నుంచి రూ.150 వరకు  విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో ప్రజలు అధిక రేట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

News March 31, 2024

ఉదయగిరి: 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

image

ఉదయగిరి మండలంలో ఏప్రిల్ 3 నుంచి 8వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది వితంతు వృద్ధాప్య దివ్యాంగ తదితర పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎంపీడీవో డి.ఈశ్వరమ్మ తెలిపారు. మండలంలో 194 మంది వాలంటీర్లు ఉండగా వారి నుంచి మొబైల్ సిమ్ బయోమెట్రిక్ యంత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.