India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ గురువారం సుమారు మూడు గంటలపాటు ఆలస్యంగా నడిచింది. సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకోవాల్సిన రైలు రాత్రి 9 గంటల తర్వాత వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రైలు కనీసం 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నెల్లూరు: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 6 వరకు.. ఆప్షన్లను పదో తేదీ వరకు.. ఆప్షన్ల మార్పు 11 వరకు.. సీట్ల కేటాయింపు 13న.. జాయినింగ్ రిపోర్టులను 14 నుంచి 19వ తేదీ వరకు అందజేయనున్నట్లు చెప్పారు.
కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద రూ.కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. చెన్నై బస్సులో సీఐ శ్రీనివాసరావు తనిఖీలు చేయగా ఐదుగురు మహిళల వద్ద రూ.1.61 కోట్లు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. అలాగే మిర్యాలగూడ నుంచి చెన్నై వెళ్తున్న కారులో రూ.కోటి విలువైన 1497 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికాయి. మరోవైపు వెంకటాచలం టోల్‌గేట్ వద్ద 1.65 కేజీల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో 3,14,422 మంది లబ్ధిదారులకు పింఛన్ కానుక అందజేయనున్నారు. 2,28,471 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జూన్ 5వ తేదీలోపు జమ చేస్తారు. దివ్యాంగులు, ఆరోగ్యం సక్రమంగా లేని 85,951 మంది లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది.
NLR: అపార్ట్‌మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న వ్యభిచార కేంద్రంపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకురాలితో పాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంకు ప్రాంతానికి చెందిన శ్రీలత 9 నెలల క్రితం టెక్కేమిట్టలోని ఓ అపార్ట్‌మెంట్లో ఫ్లాటు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ దాడి చేశారు.
సూళ్లూరుపేటలో స్నేహితుడిని కట్టేసి యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో మాట్లాడి.. యువతికి ప్రభుత్వ వసతి సదుపాయం కల్పించి, కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.
భానుడు ప్రతాపంతో నెల్లూరు జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం సమయానికే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వృద్ధులు చిన్నారులు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరులో ఈరోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కష్టపడి పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కుషల్ శ్రీనివాస్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అన్ని సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు వచ్చాయి. హిందీలో 15 మార్కులే వచ్చాయి. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 75 మార్కులు వచ్చాయి. మెరుగైన మార్కులు వచ్చినా ఫెయిల్ చేయడంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఎన్నికల ఫలితాల రోజు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే మెసేజ్‌లు పంపితే గ్రూప్ అడ్మిన్ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు గెలిచినా పాజిటివ్‌గా ఉండాలని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనంతసాగరం మండలం, సోమశిలలోని శివాలయం ఎదురుగా ఉన్న పెన్నా నదిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభ్యం అవ్వడంతో మృతురాలిది కడప జిల్లా, రాజంపేట మండలం, బాలరాజుపల్లికి చెందిన పంగ అంకన్నగారి చెన్నమ్మ (74) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.