Nellore

News May 30, 2024

అనంతసాగరం: పెన్నా నదిలో మృతదేహం లభ్యం

image

అనంతసాగరం మండలం, సోమశిలలోని శివాలయం ఎదురుగా ఉన్న పెన్నా నదిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభ్యం అవ్వడంతో మృతురాలిది కడప జిల్లా, రాజంపేట మండలం, బాలరాజుపల్లికి చెందిన పంగ అంకన్నగారి చెన్నమ్మ (74) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ఆరో రౌండ్‌తో తేలనున్న పొదలకూరు లెక్క

image

సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో పొదలకూరు మండలం హాట్ టాపిక్ గా మారింది. ఈ మండలమే విజేత ఖరారులో కీలకం కానుంది. పొదలకూరు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలున్నాయి. సూరాయపాళెంతో మొదలై బ్రాహ్మణపల్లి ఈవీఎంతో ఈ మండలం కౌంటింగ్ ముగుస్తుంది. ఐదు రౌండ్ల వరకు పూర్తిగా పొదలకూరు మండలానికి సంబంధించిన ఈవీఎంల కౌంటింగే జరుగుతుంది. ఆరో రౌండ్ కు కేవలం మూడు ఈవీఎంలు మిగులుతాయి.

News May 30, 2024

నెల్లూరు: ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడి అత్యాచారం

image

ప్రేమికుడిని కట్టేసి, ప్రియురాలిపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన సూళ్లూరుపేటలో జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే స్నేహితులున్నారు. ఆ యువతి జన్మదినం సందర్భంగా.. గుడికి వెళ్దామని చెప్పి మార్గమధ్యంలో ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కాతో అతణ్ని కట్టేశారు. బాలాజీ కాపలాగా ఉండగా ఏడుమలై యువతిని (20) బెదిరించి అత్యాచారం చేశాడు.

News May 30, 2024

నెల్లూరు: వేర్వేరు ఘటనల్లో ఈత కొడుతూ ఇద్దరి దుర్మరణం

image

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. విడవలూరు(M) వెంకటనారాయణపురం వాసి మురళీకృష్ణ స్నేహితులతో కలిసి పైడేరువాగు వంతెన వద్ద ఈతకొడుతూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఇందుకూరుపేట(M), రాముడుపాలేనికి చెందిన రామయ్య,గీతల కుమార్తె భవ్యశ్రీ(12) నెల్లూరు వెంగళరావునగర్‌లో గల స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈతకొడుతూ నీటిలో మునిగిపోయింది. బాలికను సిబ్బంది బయటకుతీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 30, 2024

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీవ్ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో ఎన్నికల ఓట్ల లెక్కింపు, లా అండ్ ఆర్డర్ సమస్యలు తదితర అంశాలపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టర్ అందులో పాల్గొని పలు అంశాలను వివరించారు.

News May 29, 2024

జొన్నవాడ: కొడిముద్ద తింటే సంతానం కలిగినట్టే..!

image

నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షమ్మ కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు దేవతగా పేరు పొందారు. అమ్మను దర్శిస్తే అన్ని కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సంతానం కోసం పూజలు చేసి అమ్మవారిని దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అమ్మవారి ఆలయంలో ఇచ్చే కొడి ముద్దలు స్వీకరించడానికి సంతానం లేని జంటలు ఇక్కడ పోటీ పడుతుంటారు. ప్రస్తుతం అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

News May 29, 2024

గూడూరు: తమ్ముడిని చంపిన అన్న

image

గూడూరు మండలం చంబడిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకునే క్రమంలో అడ్డువచ్చిన తమ్ముడు పురిణి అశోక్‌ను అన్న క్షణికావేశంలో కర్రతో కొట్టాడు. దాడిలో గాయపడిన తమ్ముడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 29, 2024

వెంకటాచలం: అటువైపు వెళ్లే వారు జాగ్రత్త

image

తిక్కవరప్పాడు-కంటేపల్లి మార్గంలో తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం పలు గ్రామాల రైతులు, ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు శిథిలమై సగంపైగా కూలిపోవడంతో బైకులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అదుపుతప్పితే ప్రమాదం జరిగేలా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News May 29, 2024

నెల్లూరు: 1వ తేదీ లోపే ఏజెంట్ల దరఖాస్తులు

image

ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఏజెంట్ల కోసం అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలని నెల్లూరు జిల్లా అధికారులు తెలిపారు. 4న ఉదయం 8 గంటల్లోపు ఏజెంట్ల మార్పునకు అవకాశం ఉందన్నారు. ఒక సారి ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించిన తర్వాత ప్రక్రియ పూర్తయిన తర్వాతే బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు.

News May 29, 2024

నెల్లూరు: రౌండ్ల వారిగా నియోజకవర్గ ఫలితాలు

image

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఫలితాలు 20 రౌండ్లు, కావలి 23, ఆత్మకూరు 20, కోవూరు 24, నెల్లూరు నగరం 18, నెల్లూరు గ్రామీణం 21, ఉదయగిరి 24, సర్వేపల్లి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 14టేబుళ్లు ఏర్పాటు చేయగా.. 4 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడించేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు.