Nellore

News May 29, 2024

నెల్లూరులో తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..

image

జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నెల్లూరు జిల్లాలో తొలి ఫలితం 2 గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గానిది వెలువడనుంది. ఆఖరుగా ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల ఫలితాలు 4 గంటలకు వెలువడనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ లెక్కన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

News May 29, 2024

నెల్లూరు: 4న మద్యం విక్రయాలు బంద్

image

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జూన్ 4వ తేదీన జిల్లాలోని మద్యం దుకాణాలను మూత వేయడంతో పాటు కల్లు విక్రయాలను నిలిపివేయనున్నారు. ఆ రోజు పూర్తిగా డ్రైడేగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

News May 28, 2024

నెల్లూరు జైలులో సతీశ్.. విడుదల ఎప్పుడంటే..?

image

విజయవాడలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేయగా సతీశ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఇవాళ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సంబంధిత ఉత్తర్వులు జిల్లా జైలు అధికారులకు అందిన తర్వాత నిందితుడిని విడుదల చేసే అవకాశం ఉంది. సంబంధిత ప్రొసీడింగ్స్ పూర్తి అయితే ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం సతీశ్ జైలు నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది.

News May 28, 2024

నెల్లూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు

image

ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియా సెంటర్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మూడంచెల సెక్యూరిటీ నియామించామన్నారు . ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీన జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని SP ఆరీఫ్ హఫీజ్ వెల్లడించారు. ఎవరూ గుంపులుగా తిరగ వద్దని సూచించారు.

News May 28, 2024

నెల్లూరు: ఫస్ట్ ఆ ఓట్ల లెక్కింపే

image

జూన్ నెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. అనంతరం 8.30 గంటల నుంచి ఈవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులుగా శామ్యూల్, ప్రత్యూషలను ఎన్నికల సంఘం నియమించినట్లు కమిషనర్ వివరించారు.

News May 28, 2024

నెల్లూరు: పలు దుకాణాలు క్లోస్

image

ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాలు విధిస్తామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాల మేరకు చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో  వివిధ హోటళ్లు, బేకరీల ప్రాంగణాలను తనిఖీ చేశారు. పరిశుభ్రతా ప్రమాణాలను పాటించని వివిధ దుకాణాలకు 10 వేల రూపాయల జరిమానాలు విధించి, కొన్ని దుకాణాలను మూసివేశారు.

News May 28, 2024

నెల్లూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు.

News May 28, 2024

నెల్లూరు: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

image

సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందిచకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసింది.

News May 28, 2024

నెల్లూరు: బాలికను రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నం

image

సంగం మండలంలోని ఓ బాలికను ఆటో డ్రైవర్ రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలిక పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు షేక్ బాదుషా అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేది. కాగా వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న అతను.. బాలికపై కన్నేసి తన ఆటోలో పక్కనే కూర్చొబెట్టుకుని అశ్లీల వీడియోలు చూపిస్తూ అసభ్యకరకంగా ప్రవర్తించేవాడు. చివరికి వివాహం చేసుకునే కుట్రకు పాల్పడ్డాడు.

News May 28, 2024

బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ సూచనలు

image

నెల్లూరు: పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేది ప్రియదర్శిని కాలేజీలో జరుగుతుందన్నారు.