India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు: పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేది ప్రియదర్శిని కాలేజీలో జరుగుతుందన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. మీడియా సెంటర్, కౌంటింగ్ ఏజెంట్ల భోజన ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఫలితాలపై ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎడతెగని టెన్షన్ నెలకొంది. మరో వారం రోజుల్లోనే ఓటర్ తీర్పు బహిర్గతం కానుంది. ఈక్రమంలో జిల్లాలో ఏ మూల చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. సిటీలో కన్నా గ్రామాల్లో రచ్చబండలపై అందరూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చూడలి మరి.
నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఆటో బోల్తా పడింది. కడపకు చెందిన కరీమున్నీసా మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇవాళ ఒక్కో రోజే అనంతసాగరం, ఏఎస్ పేట, సైదాపురం, మనుబోలు మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోగా.. చంద్రగిరి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామస్థులు నలుగురు కన్నుమూశారు.
నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి పనుల పురోగతిని అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద హైవేపై సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని సమాచారం. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. యువకుడిని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉదయగిరి దుర్గం పై గత కొన్ని రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వీరు సాధు వస్త్రాలు ధరించి గుప్తనిధుల కోసం పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ గుప్త నిధులు కోసం వచ్చి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే అధికారులు నిఘా ఉంచాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
నెల్లూరు రూరల్, కోవూరు డివిజన్ లలో డి.పి.ఈ. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో అక్రమ విద్యుత్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రొయ్యల గుంటలకు అక్రమ విద్యుత్ వాడుతున్న వారిపై రాత్రి దాడులు నిర్వహించారు. రైడ్స్ లో విద్యుత్ డి.పి.ఈ. విభాగం, ఏ.పి.టి.ఎస్.సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వారి సిబ్బంది పాల్గొన్నారు. సుమారు మూడు లక్షల వరకు జరిమానా విధించారు.
చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని ఎంకొంగవారిపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మృతులు ఇందుకూరుపేటకు చెందిన వారుగా గుర్తించారు.
చిల్లకూరు: కోట అడ్డరోడ్డు ప్రాంతంలోని హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం.. సైదాపురం మండలం గిద్దలూరుకి చెందిన వేణుగోపాల్ గుప్తా(58) బైక్‌పై కోటకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్తుండగా కోట అడ్డరోడ్డు వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన ఆయన్ను చికిత్స నిమిత్తం గూడూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.