Nellore

News May 27, 2024

నెల్లూరు: పాలిసెట్ కౌన్సిలింగ్ కు ఇవి తప్పనిసరి…

image

వేంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం కౌన్సిలింగ్, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. అర్హులైన వారు ముందుగా కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కళాశాలలో వెరిఫికేషన్, ఫీజు రసీదుతో పాటు పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మార్క్ లిస్ట్, 4 -10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు.

News May 27, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా ఆదివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

News May 26, 2024

జిల్లా కలెక్టర్ పై మండిపడ్డ మంత్రి కాకాణి

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్‌లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు గాని, ఎన్నికల అధికారులకు గానీ కనీసం వసతులు కల్పించలేదన్నారు.

News May 26, 2024

నెల్లూరు: ఆంజనేయస్వామి గుడి సమీపంలో వ్యక్తి సూసైడ్

image

వరికుంటపాడు మండల పరిధిలోని విరువూరు శివారు ప్రాంతంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన విరువూరు గ్రామానికి చెందిన తాళ్ల నాగార్జున రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతుడు ఆంజనేయస్వామి మాల ధరించి ఉన్నారు.

News May 26, 2024

వాకాడులో రోడ్డు ప్రమాదం

image

వాకాడు మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిరెడ్డిపాలెం వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News May 26, 2024

28న షార్ నుంచి రాకెట్ ప్రయోగం

image

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని షార్ నుంచి మే 28న అగ్నిబాణ్ సార్టెడ్ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఉదయం 5.45 గంటలకు షార్‌లోని ప్రైవేటు లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించారు. సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌తో ఈ రాకెట్ పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.

News May 26, 2024

నెల్లూరు: డాక్టర్లకు షోకాజ్ నోటీసులు సిద్ధం

image

జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు డాక్టర్లకు షోకాజ్ నోటీసుల జారీకి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. నెల్లూరులో 20, కావలిలో నాలుగు, కందుకూరులో రెండు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున మొత్తం 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న కారణంతో డిఎంహెచ్వో పెంచలయ్య నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

News May 26, 2024

నెల్లూరు: ‘వేమిరెడ్డికి లక్షన్నర మెజార్టీ ఖాయం’

image

ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి 20వేల మెజార్టీ, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్షన్నర మెజార్టీతో గెలుస్తున్నారని సీనియర్ నాయకుడు, అనంతసాగరం మండలం పాతాళపల్లి సర్పంచ్ బిజీ వేముల ఓబుల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న టీడీపీ సునామీ సృష్టించబోతుందన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని చెప్పారు.

News May 26, 2024

నెల్లూరు: లెక్కింపు ప్రక్రియకు 130 కెమెరాల సిద్ధం : కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.హరినారాయణన్ తెలిపారు. అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 324 పోలింగ్ బూతులు, అత్యల్పంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 248 ఉన్నట్లు పేర్కొన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో 130 లేదా 140 కెమెరాలను సిద్ధం చేస్తామన్నారు.

News May 25, 2024

నెల్లూరు: ఆ రెండు రోజులు జాగ్రత్త

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జాన్ 3 నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బల్క్ మెసేజ్లు పంపడం నిషిద్ధమన్నారు. 144 సెక్షన్ కారణంగా విజయోత్సవాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 3వ తేదీ నుంచి 5 వరకు రెండురోజులు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.