India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జాన్ 3 నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బల్క్ మెసేజ్లు పంపడం నిషిద్ధమన్నారు. 144 సెక్షన్ కారణంగా విజయోత్సవాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 3వ తేదీ నుంచి 5 వరకు రెండురోజులు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
1000 మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. మూడంచెల భద్రత, కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. కనుపర్తిపాడులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించకూడదన్నారు.
నెల్లూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మిట్ట మధ్యాహ్నం మబ్బులు కమ్ముకున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.
ఉదయగిరిలోని శివారు ప్రాంతం కొత్త చెరువులో ప్రమాదపుశాత్తు కాలుజారి పడి ఉపాధి కూలి పెరుమాళ్ల వెంకటలక్ష్మి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పనులకు వెళ్లేందుకు చెరువు దగ్గర దాచి ఉంచిన పనిముట్లను తీసుకునేందుకు ముగ్గురు మహిళలు వెళ్లారు. పనిముట్లు తీసే క్రమంలో వెంకటలక్ష్మి కాలుజారి చెరువులో పడిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆమెను ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయారు.
పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శుక్రవారం రాత్రి అశ్వ వాహనంపై ఊరేగించారు. ప్రత్యేక వాయిద్యాలు, భక్త జన కోలాహలం నడుమ ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. చివరిగా ఇవాళ రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గోనుపల్లి గ్రామంలో ఊరేగించనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.
నిన్న మొన్నటి వరకు కోడి గుడ్డు ధర రూ.5ల వరకు ఉండగా నేడు ఎనిమిది రూపాయలకు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రస్తుతం ఉదయగిరిలో 30 గుడ్లు రూ.200 పలుకుతున్నాయి. హోల్ సేల్‌లో ఒక కోడిగుడ్డు రూ.6.5లు కాగా రిటైల్ మార్కెట్లో రూ.8 రూపాయలు పలుకుతుంది.
ఆత్మకూరులో శుక్రవారం ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హుస్సేన్ (25) స్థానిక పెద్ద మసీదు ప్రాంతంలోని ఓ ఇంటికి అద్దాలు బిగించే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తూ.. ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుస్సేన్ ఉత్తర ప్రదేశ్ నుంచి వలస వచ్చినట్లు ఎస్ఐ ముత్యాల రావ్ తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని తెప్పపై ఉంచి కోనేటిలో ఊరేగించారు. నేత్రపర్వంగా సాగిన ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనులు కోలాహలంతో పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో కోన మారుమోగింది.
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీఆర్డీ లవన్న తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాలులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డీఆర్డీ సమావేశం నిర్వహించారు. పరీక్షను పక్కాగా నిర్వహించాలన్నారు.
ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
Sorry, no posts matched your criteria.