Nellore

News May 24, 2024

కొడవలూరులో అగ్ని ప్రమాదం

image

కొడవలూరు మండలం గండవరం గౌతమ్ నగర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామంలోని ఓ రైతుకు చెందిన గడ్డివాము కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 24, 2024

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇటీవల బెంగుళూరు రేవ్ పార్టీలో కాకాణి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు గుర్తించిన విషయం తెలిసిందే.. అయితే కాకాణిపై సోమిరెడ్డి చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. ‘నీవి,నావి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ కి ఇద్దాం..అప్పుడు తెలుస్తుంది ఎవరు డ్రగ్స్ తీసుకుంటారో’ అని కాకాణి కౌంటర్ వేశారు.

News May 24, 2024

నెల్లూరు: హత్య కేసులో ఆరుగురి అరెస్ట్

image

బాపట్లలో ఈ నెల 15న జరిగిన ప్రశాంత్ హత్యకేసులో నెల్లూరుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ప్రశాంత్ బాపట్ల పాత బస్టాండ్ ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డితో పాటు ఆర్.లక్ష్మయ్య, ద్వారకా, చెర్ల లక్ష్మణ్, పంగా రోహిత్, కొమరిక ఈశ్వర్‌ను అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

News May 24, 2024

నెల్లూరు: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మధును ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సస్పెండ్ చేశారు. మధు భార్య విజయలక్ష్మి నెల్లూరు 41వ డివిజన్ కార్పొరేటర్. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధు వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఆధారాలను పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేయడంతో.. సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News May 24, 2024

నెల్లూరు: విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

image

టీపీ గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు మృతి చెందారు. టేబుల్ ఫ్యాన్ వైర్లు తగిలి పడిపోయిన అన్నం నరసయ్యను కాపాడేందుకు వచ్చిన భార్య భాగ్యమ్మ కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News May 24, 2024

నెల్లూరు: ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా కమిటీ సభ్యుల బృందం

image

ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో చివరి ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ కౌంటింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. స్థానిక కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్‌తో కలిసి పరిశీలించారు.

News May 23, 2024

రాజకీయ నాయకులు సహకరించాలి: కలెక్టర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకరించాలన్నారు. గురువారం సాయంత్రం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

News May 23, 2024

ఉదయగిరి: రేపే ఇంటర్ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి పరీక్షా కేంద్రం చీఫ్ మారెళ్ల వాసు బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆరు రోజులు పాటు జరిగే ఇంటర్ పరీక్షలకు 144 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం ఐదు పరీక్ష రూములలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం మొదటి సంవత్సరం మధ్యాహ్నం రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు.

News May 23, 2024

మనుబోలు : వామ్మో చికెన్ @330..

image

చికెన్ ప్రియులను ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి..చికెన్ ధర అమాంతం పెరిగింది. మనుబోలు మార్కెట్లో బుధవారం చికెన్ ధర ఏకంగా రూ.330 అయింది. దీంతో మాంసం ప్రియులు కడుపు నిండా చికెన్ తినాలంటే జేబులు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News May 23, 2024

నెల్లూరు: ఆదాల, విజయసాయిరెడ్డిపై కంప్లైంట్

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు వైసీపీ నేతలు ఓటరు జాబితాలను చించివేయడంతో పాటు తమను బెదిరించారని టీడీపీ బూత్ ఏజెంట్లు శరవణ, మహేశ్, శివకుమార్, శ్రీనివాసులు, రహీమ్ ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 102, 103 బూతుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, 148వ బూత్ లో విజయసాయిరెడ్డి, 184, 185, 186 బూతుల్లో మొయిళ్ల గౌరీ, సురేష్ రెడ్డి భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.