Nellore

News May 23, 2024

నెల్లూరు: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవ దహనం

image

కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వెళుతున్న లారీ.. మేదరమెట్ల పైలాన్ రహదారి పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇనమనమడుగు చెందిన డ్రైవర్ శ్రీధర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఈ లోగా మంటలు చెలరేగి అతను సజీవదహనం అయ్యాడు.

News May 23, 2024

అప్రమత్తంగా ఉండండి: నెల్లూరు కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 22, 2024

అప్రమత్తంగా ఉండండి: నెల్లూరు కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News May 22, 2024

గవర్నర్‌కు వీడ్కోలు పలికిన నెల్లూరు కలెక్టర్

image

జిల్లా పర్యటనను ముగించుకుని విజయవాడకు బయలుదేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీస్, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ GM సుందరవల్లి, రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి వీడ్కోలు పలికారు. విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవం ముగియగానే గవర్నర్ బుధవారం సాయంత్రం నెల్లూరు నుంచి విజయవాడకు బయలుదేరారు.

News May 22, 2024

మూడు బంగారు మెడల్స్ అందుకున్న నెల్లూరు విద్యార్థి

image

జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటిలో బుధవారం స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరులోని వి.మాలకొండ రెడ్డి నగర్‌కు చెందిన చందన గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మూడు గోల్డ్ మెడల్స్ అందుకుంది. చందన 2021-22 బ్యాచ్‌లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. చందన మాట్లాడుతూ.. పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా రాణించాలన్నది తన ఆశయమన్నారు.

News May 22, 2024

NLR: 4 వరకు సర్వీస్ ఓటర్లకు అవకాశం

image

దూర ప్రాంతాల్లో ఉంటున్న నెల్లూరు జిల్లా ఉద్యోగులు తమ సర్వీసు ఓట్లను వినియోగించుకుంటున్నారు. ఆర్మీలో పని చేస్తున్న వారికి ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్(ETPBS) ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. వీళ్లు ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఓటు వేయవచ్చు. ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే 47 సర్వీసు ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 13 మంది ఓటు వేశారు.

News May 22, 2024

కావలిలో యువతికి వేధింపులు

image

కావలి పట్టణంలోని ఓ వీధికి చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు వేధిస్తున్న ఘటనపై పోలీసు కేసు నమోదైంది. కొంతకాలంగా ఆ యువకుడు తనను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, కత్తితో బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 22, 2024

సింహ వాహనంపై పెంచల స్వామి విహారం

image

రాపూరు మండలం పెంచలకోనలో జరుగుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సింహ వాహన సేవ జరిగింది. నృసింహ జయంతి సందర్భంగా పెంచల స్వామికి విశేష పూజలు నిర్వహించారు. సింహ వాహనంపై కొలువై కోనలో విహరించిన శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం గరుడసేవ జరగనున్న నేపథ్యంలో పెంచలకోనకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

News May 22, 2024

నెల్లూరు: కోళ్ల పంపిణీపై అధికారుల విచారణ

image

ఎన్నికల పోలింగ్‌కు మందు రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగానెల్లూరులో ఓటర్లకు ఓ పార్టీ నేతలు కోళ్లు పంపిణీ చేశారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపించారు. ఈఘటనపై మొదట గ్రామంలో విచారణ జరిపిన అధికారులు అలాంటిదేమీ లేదని తేల్చారు. పునర్విచారణ జరపాలని కలెక్టర్‌తో పాటు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీఓ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది మంగళవారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News May 22, 2024

NLR: 100 మంది ఉద్యోగులకు నోటీసులు

image

ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ సీరియస్ అయ్యారు. పోలింగ్ రోజు విధులకు గైర్హాజరైన 100 మందికి పైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు ఎందుకు హాజరు కాలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఉద్యోగుల్లో పలువురు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు.