India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూళ్లూరుపేట ఇసుకమిట్ట వద్ద రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు నెల్లూరుకు చెందిన ఏలూరు కుమార్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఉంటాడని వారు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పధకం కింద లబ్ధిదారుల ఎంపిక కు సచివాలయ సిబ్బంది ద్వారా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ పధకం జిల్లా అమలు కమిటీ సమావేశం నిర్వహించారు.
డిఐసి జనరల్ మేనేజర్ సుధాకర్ ప్రధానమంత్రి విశ్వకర్మ పధకం ఉద్దేశాలను వివరించారు.
ఉదయగిరి పంచాయతీ బస్టాండ్‌లో ఉన్న సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ ఖాదిరి వారి 219వ గంధం మహోత్సవం ఆగస్టు 2న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2వ తేదీన హక్కుదారులు, దర్గా కమిటీ సభ్యులచే సందల్ మాలి జరుగుతోందని 3వ తేదీన దర్గా కమిటీ వారి చదివింపులు, పూల చాందినీ, మేళతాళములతో దర్గా షరీఫ్ చేరుతుందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ తరఫున ఉపాధ్యాయ డీఎస్సీ పరీక్షల కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా అధికారి వై.వెంకటయ్య తెలిపారు. అందులో భాగంగా వీఆర్సీ హైస్కూల్‌లో శిక్షణ కోసం తరగతి గదులను సిద్ధం చేసినట్టు తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్స్ వారీగా అధ్యాపకులను నియమించి శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మంగళవారం రోజు జరిగిన ఏపీ శాసనసభ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడులోని నరసింహకొండ అభివృద్ధికి అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తను రూ.50 కోట్లు నిధులు తీసుకొస్తే, ఆనాటి సీఎం జగన్ దుర్మార్గంగా ఆ నిధులను ఆపేశారని మండిపడ్డారు.
ఓజిలి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో శ్రీనివాసులు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి స్వగ్రామమైన ఒంగోలుకు వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీఈఏపీ సెట్ 2024 లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంజినీరింగ్ తుది జాబితా కౌన్సెలింగ్ ఇవాళ నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందని ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అడ్మిన్ శివకుమార్ తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందని విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజును నెల 25వ తేదీలోపు చెల్లించాలని తెలిపారు.
ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఆధార్ క్యాంపులను క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. అలాగే చిన్న పిల్లలకు నూతన ఆధార్ కార్డుల జారీ, 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఆధార్ బయోమెట్రిక్, 18ఏళ్ల పైబడిన వారి ఆధార్ అప్డేడేషన్‌ను విరివిరిగా చేపట్టి ఆధార్ సమస్యలను పరిష్కరించాలన్నారు.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నియామకంపై విచారణ జరుగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైనప్పుడు ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులు APPSCలో కీలకంగా వ్యహరించారు. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విశాఖ భూదందాలో శాంతి, సుభాష్ పాత్రపై విచారణ జరుగుతోంది’ అని ఆనం అన్నారు.
నామినేటెడ్ పదవులపై టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీల నేతల్లోనూ ఆసక్తి నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీ తిరుపతి ఎంపీ బరిలో నిలవగా జనసేన ఉమ్మడి నెల్లూరు పరిధిలో ఎక్కడా పోటీ చేయలేదు. ఈ క్రమంలో జిల్లా స్థాయి పదవులను ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. గతంలో నుడా డైరెక్టర్ గా బీజేపీ నేత వ్యవహరించారు. ఈ దఫా అన్నీ పాలకవర్గాల్లో మూడు పార్టీల నేతలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది.
Sorry, no posts matched your criteria.