India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, త్వరలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులోకి తెస్తున్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో అధికారులు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నెల్లూరు సిటీలోనూ అమలులో ఉందని DSP శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ఈ సారి వెంకటగిరి పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. వాళ్లు ఎక్కువా. మేం తక్కువా అని గ్రామీణ ప్రాంతాల్లో చర్చ సైతం రేగింది. ఈక్రమంలో అభ్యర్థులు ప్రత్యేకంగా చూసుకున్న పట్టణ ఓటర్లు ఎవరికి అండగా నిలిచారో..?
వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హరి నారాయణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటి వసతిపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న రైలు… పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు నీలం రంగు జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో చిన్నారిని పోలీసులు వెతికిపట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం జరిగింది. నెల్లూరుకు చెందిన శివ కుటుంబ సభ్యులతో ఆదివారం బీచ్‌కు వచ్చారు. వారి కుమార్తె రక్షిత(5) బీచ్‌లో తప్పిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మెరైన్ సీఐ కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్‌లో ఒంటరిగా ఉన్న పాపను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపనున్నట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఆదివారం నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని నవాబ్ పేట, కావలి 1 టౌన్, కావలి 2 టౌన్, కావలి రూరల్, ఉదయగిరి, వింజమూరు పరిధిలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి వరకు ఫీజు చెల్లించ లేకపోయిన విద్యార్థులు సోమవారం చెల్లించాలని ఆర్ఐవో ఆదూరి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో తత్కాల్ పథకం కింద రూ.3000 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. SHARE IT..
ఖరీఫ్ సీజన్‌లో భాగంగా బోర్ల కింద పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 4316 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసినట్లు, వ్యవసాయ శాఖ నెల్లూరు జేడీ సత్యవాణి తెలిపారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మినుము, పెసర, కందుల విత్తనాలను కూడా 50 శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలూ అందుబాటులో ఉన్నాయన్నారు.
ఉదయగిరి పట్టణంలోని విక్టోరియా మహారాణి గెస్ట్ హౌస్ 137 ఏళ్లు పూర్తిచేసుకుంది. 1887లో ఉదయగిరికి మహారాణి ఆటవిడుపుగా వచ్చారు. ఈక్రమంలో అప్పట్లో దీనిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో అది లైబ్రరీగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఈ గ్రంథాలయం మేధోశక్తిని అందజేస్తూ వస్తోంది.
ఉదయగిరి ఆనకట్టపై నేటి ఉదయం <<13274062>>లభ్యమైన పసికందు వివరాలు తెలిశాయి. <<>>పోలీసుల విచారణ నేపథ్యంలో ఉదయగిరి మండల పరిధిలోని ఆర్లపడియ ఎస్టీ కాలనీకి చెందిన ఓ మహిళ.. కాన్పు కోసం ఉదయగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు వచ్చిందన్నారు. కాన్పు సమయంలో పుట్టిన బిడ్డ మృతి చెందడంతో వారు ఆ పసికందును అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని పూడ్చి పెట్టకుండా ఆనకట్ట వద్ద పడేసినట్లు తెలిసింది.
Sorry, no posts matched your criteria.