Nellore

News May 17, 2024

కూటమిదే విజయం: ఆనం రామనారాయణ రెడ్డి

image

సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు జగన్ రెడ్డికి ఊడిగం చేశారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార యంత్రాంగం ఇంతకు దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సర్వే సంస్థతో తీసుకున్న సెల్ఫీ జగన్‌కి ముగింపు అని అన్నారు.

News May 17, 2024

మేము గాంధీ మహాత్ములం కాదు: సోమిరెడ్డి

image

వైసీపీ నేతలు దాడులు చేస్తుంటే.. చూస్తూఉండానికి తాము గాంధీ మహాత్ములం కాదని గుర్తుంచుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ లాంటి ఏపీని పాత బిహార్‌లా మార్చడం దుర్మార్గమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా తమపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

News May 17, 2024

సంగం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సంగం మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడు మర్రిపాడు మండలం, ఇర్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

News May 17, 2024

నెల్లూరు: కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

image

సార్వత్రిక ఎన్నికల చివరి ప్రక్రియను అత్యంత ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, 117- నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ గురువారం తెలిపారు. స్థానిక కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈఈ చంద్రయ్య, తదితరులతో కలిసి పరిశీలించారు.

News May 16, 2024

తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటు

image

ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్‌ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

News May 16, 2024

గూడూరు: ప్రమాదానికి గురైన వందే భారత్ ట్రైన్

image

విజయవాడ నుంచి చెన్నై‌కు గూడూరు మీదుగా నడిచే వందే భారత్ ట్రైన్ ఇంజిన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమై గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ ట్రైన్ గూడూరుకు సాయంత్రం 6.53 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. రోజు మాదిరిగానే ఇవాళ వచ్చిన ఈ ట్రైన్ గూడూరులో స్టాప్ లేకపోయినా నిమిషం ఆగింది. అప్పుడే ట్రైన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైనట్టు స్టేషన్‌లోని ప్రయాణికులు గమనించారు. ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 16, 2024

అల్లూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

image

అల్లూరు మండలంలోని బోడిసత్రం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కావలికి చెందిన శీనయ్య మోపురు మీదుగా అల్లూరు వెళుతుండగా బోడిసత్రం వద్ద బర్రె అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. వాహనదారులు వెంటనే స్పందించి, అంబులెన్స్‌లో అతన్ని హాస్పటల్‌కు తీసుకెళ్లారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 16, 2024

ఈవీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ సూచించారు. గురువారం నెల్లూరు రూరల్‌ మండల పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూములను కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు జిల్లా పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

News May 16, 2024

నెల్లూరు జిల్లాలో పిడుగుపాటు.. 6 మేకలు, 2 గొర్రెలు మృతి

image

ఏఎస్‌పేట మండలం చౌట భీమవరం గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఇద్దరు కాపరుల ఆరు మేకలు, రెండు గొర్రెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. ఆ మూగజీవాల విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని కాపరులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

News May 16, 2024

నాయుడుపేటలో దంచి కొడుతున్న వర్షం

image

నాయుడుపేట పట్టణంలో గత రెండు రోజులుగా తీవ్ర ఉక్క పోత తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 45 డిగ్రీలకు తగ్గకుండా ఎండ తీవ్రత ఉండేది. ఇవాళ ఉరుములతో కూడిన వర్షం రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఆగకుండా 15 నిమిషాల నుంచి కురుస్తూనే ఉంది.