Nellore

News May 16, 2024

నెల్లూరు: 80 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాలివే

image

నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో నాలుగుచోట్ల 80శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. కొవూరులో 79.29, నెల్లూరు రూరల్ 67.76, నెల్లూరు సిటీ 71.72 గూడూరులో 78.89% నమోదైంది. మిగిలిన ఆత్మకూరు, కావలి, సర్వేపల్లి, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో 80శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. మరి ఇది గెలుపు ఓటముల్లో ఎవరిపై ప్రభావం చూపేనో..?

News May 16, 2024

నెల్లూరు: పొగాకు అత్యధిక ధర కిలో రూ.299

image

మర్రిపాడు మండలంలోని డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన అమ్మకాల్లో మేలిమి రకం పొగాకు అత్యధిక ధర కిలో రూ.299 పలికింది. కేంద్రానికి రైతులు 963 బేళ్లను వేలానికి తీసుకురాగా 910 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర కిలో రూ.205 పలికింది.

News May 16, 2024

నెల్లూరు: అందుబాటులో 10th సప్లిమెంటరీ హాల్‌టికెట్లు

image

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ పీవీజే రామారావు ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు లాగిన్ నుంచిగానీ, విద్యార్థి పుట్టిన తేదీ ఉపయోగించిగానీ ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. వీరికి ఈ నెల 25 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు.

News May 16, 2024

NLR: ఇంటర్ అడ్మిషన్లు

image

నెల్లూరు జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో బుధవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి సంవత్సరం కోర్సుల్లో తొలిదశ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ శ్రీనివాసులు తెలిపారు. 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 22 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్లు ఇస్తామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రెండో దశ అడ్మిషన్లు జూన్ 10 నుంచి జూలై 1 వరకు ఉంటాయి.

News May 15, 2024

పెళ్లయిన 16 రోజులకే రైలు కింద పడి ఆత్మహత్య

image

నాయుడుపేట పట్టణంలోని పిచ్చిరెడ్డి తోపు ప్రాంతానికి చెందిన రాజేశ్(25) అనే యువకుడు నాయుడుపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతునికి 16 రోజుల క్రితమే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి రైల్వేపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 15, 2024

నెల్లూరు నుంచి ఢిల్లీకి ఎవరో..?

image

నెల్లూరు ఎంపీ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైసీపీలో కీలక నాయకుడైన వేణుంబాక విజయసాయిరెడ్డి, ఇటీవల వరకు వైసీపీ ఎంపీగా కొనసాగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకుడైన విశ్రాంత ఐఏఎస్ అధికారి కొప్పల రాజు తలపడ్డారు. ముగ్గురూ ప్రచారాన్ని హోరెత్తించారు. నెల్లూరుకు ప్రత్యేక మేనిఫెస్టోలు ప్రకటించారు. హోరాహోరీ పోరులో ఫైనల్‌గా లోక్ సభలో అడుగుపెట్టేదెవరో…?

News May 15, 2024

రికార్డ్ సృష్టించిన సర్వేపల్లి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్లు రికార్డ్ తిరగరాశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,32,011 మంది ఓటర్లు ఉండగా.. 95,962 మంది పురుషులు, 98,651 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెరసి 83.88శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అత్యధికం. అయితే గత 2019 ఎన్నికల్లో సైతం సర్వేపల్లిలో 82.18 శాతం పోలింగ్‌ నమోదైంది.

News May 15, 2024

నెల్లూరు రూరల్ రూలర్ ఎవరో..?

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏలబోయే నాయకుడెవరనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. జిల్లాలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న స్థానాల్లో రూరల్ ఒకటి. 66.18 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు మాత్రం సైలెంట్‌గా ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. జూన్ 4 తర్వాత రూరల్ రూలర్ ఎవరో తేలనుంచి.

News May 15, 2024

NLR: నేటి నుంచి ఇంటర్ అడ్మిషన్లు

image

నెల్లూరు జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో బుధవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి సంవత్సరం కోర్సుల్లో తొలిదశ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఆర్ఐఓ శ్రీనివాసులు తెలిపారు. 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 22 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్లు ఇస్తామన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రెండో దశ అడ్మిషన్లు జూన్ 10 నుంచి జూలై 1 వరకు ఉంటాయి.

News May 15, 2024

నెల్లూరులో నెగ్గేదెవరో..!

image

నెల్లూరు సిటీ నియోజకవర్గ విజేత ఎవరనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గతానికి భిన్నంగా భారీ స్థాయిలో 70.20 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో చేసిన అభివృద్ధే పొంగూరు నారాయణను గెలిపిస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతుండగా, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖలీల్‌ను విజేతగా నిలుపుతాయని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా భారీగా పోలైన ఓట్లు అంతిమంగా ఎవరిని విజేతగా నిలుపుతాయో..?