India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూళ్లూరుపేటలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు, కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఇవాళ రాత్రి మల్లం గ్రామం నుంచి మాంబట్టు సెజ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో నైట్ డ్యూటీకి ఉద్యోగులతో వెళ్తున్న బస్సు టర్నింగ్ తిరిగే క్రమంలో వెనక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఘటనలో బస్సులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
జిల్లాలోని కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెంకు చెందిన భయ్యా రాణి అనే యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఊచగుంటపాలెంకు చెందిన కొత్తూరు అనుప్ అనే వ్యక్తి ఆమెను బంగారం కోసం పెట్రోల్ పోసి తగలబెట్టాడని పోలీసులతో చెప్పారు. జువ్వలదిన్నె తిప్పలేరు కాలువ వద్ద ఆమె శవం లభించింది.
నెల్లూరులో గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 25,535 మందికి 17042 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈసారి 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం(69) పెరిగినా 8వ స్థానానికి పడిపోయింది. అలాగే సెకండ్ ఇయర్‌లో గతేడాది 22,789 మందికి 17,438 మంది పాసయ్యారు. 77 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇవాల్టి ఫలితాల్లో 81 శాతంతో 6వ స్థానానికే పరిమితమైంది.
నెల్లూరు వీఆర్ లా కళాశాల విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెమిస్టరు, 6వ సెమిస్టరు పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 6వ సెమిస్టర్ పరీక్షలతో కోర్స్ పూర్తి కానుంది. మే 8న మొదటి సెమిస్టరు విద్యార్థులకు, మే 2న 6వ సెమిస్టరు విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 69 శాతంతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. 21,293 మందికి 17,292 మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలవగా.. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో ఇదే జిల్లా 81 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 25,990మందికి 21,062 మంది పాసయ్యారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు రూ.5,28,168 విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశామన్నారు. పొరుగు మద్యం విక్రయాలపై 3 కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనధికార విక్రయాలపై 191 కేసులు నమోదు చేసి 194 మందిని అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో జిల్లాలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ పెరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా జరుగుతున్నాయి. కొందరు కోవర్టులుగా పని చేస్తూ సొంత పార్టీకి నష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి వెంట తమ కోవర్టులు ఉన్నారని వైసీపీ కోవూరు MLA అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడే స్వయంగా చెప్పడం ఇందుకు నిదర్శనం.
ఇంటర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆస్ఐఓ డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 26,419 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 25,657 మంది హాజరయ్యారు. మొత్తంగా 52,076 మంది ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.
వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్ సమీపంలో జెండా వీధిలో ఉంటున్న ఆర్టీసీ ఉద్యోగి షేక్ నసురుద్దీన్ ఇల్లు గురువారం పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.6 లక్షల నష్టం జరిగిందని బాధితుడు నసురుద్దీన్ వాపోయాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఎలక్ట్రికల్ పరికరాలు, బంగారం, నగదు, ఖరీదైన దుస్తులు, వస్తువులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రంజాన్ రోజున రోజు తీవ్ర విషాదం నెలకొంది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన SK ఉమర్ బీటెక్ చదువుతున్నాడు. ఇవాళ చికెన్ దుకాణంలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో అతనికి కరెంట్ షాక్ తగలడంతో చనిపోయాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.