India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోవూరులో పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. కోవూరు సచివాలయం-2 పరిధిలో పనిచేస్తున్న 29 మంది తమ రాజీనామా పత్రాన్ని సచివాలయం అధికారులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ ప్రభుత్వం చేసిన కుట్రలకు నిరసనగా తాము రాజీనామా చేశామన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకున్న తరువాత విధులలో చేరుతామని తెలిపారు.
కావలి రెవెన్యూ కార్యాలయంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్‌ను కావలి రిటర్నింగ్ అధికారి శీనానాయక్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ధృడమైన ప్రజాస్వామ్యం కోసం తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 20 రోజుల్లో దాదాపు 981 మంది రాజీనామా చేయగా… ఇంకా వందల సంఖ్యలో రాజీనామాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 13 వేల మంది వాలంటీర్లు ఉండగా.. వారిలో దాదాపు పదిశాతం మంది రాజీనామాలు చేశారు. కావలి, కోవూరు నియోజకవర్గాల నుంచి అత్యధికంగా వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వ్యక్తికే ఇక్కడి ఎంపీ టికెట్ లభించింది. ఆయన ఎవరో కాదు కొప్పుల రాజు. IAS అధికారి అయిన రాజు నెల్లూరు కలెక్టర్‌గా 1988 నుంచి 1992 వరకు పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించారు. రాహుల్‌కు దగ్గర మనిషి. గతంలో నెల్లూరులో పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించింది.
వింజమూరు మండలం చాకలికొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణపై కేసు నమోదైంది. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు ఏఆర్ కానిస్టేబుల్ పై వింజమూరు పోలీస్టేషన్లో ఎస్సై కోటిరెడ్డి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనను అందరు తప్పక పాటించాలని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది.
నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ మూవీ టీమ్ తమ చిత్రం విజయవంతంగా పూర్తయి విజయం సాధించాలని పూజలు నిర్వహించారు. 25 కళాశాల అధ్యక్షులు, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా.. వైభవంగా జరిగాయి. హీరోగా శ్రీరామ్, హీరోయిన్ గా మిధున ప్రియ వ్యవహరిస్తుండగా కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు.
కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా టిపుటూరుకు చెందిన అనూషా సైబర్ మోసానికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి వివిధ దశల్లో రూ.20 లక్షలను సైబర్ నేరస్తులు లాగేశారు. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో నెల్లూరు శోధన్ నగర్‌కు చెందిన డి.జగదీశ్, సంతోశ్, వెంకటగిరి మండలం వల్లివేడుకు చెందిన సురేశ్, కార్వేటినగరానికి చెందిన మునీంద్ర ఉన్నారు.
తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ఎన్నికైన ఘనత చింతామోహన్ దే. 1984లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 1989, 1991, 1998, 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి లోక్ సభలో ప్రవేశించారు. కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.2.70 లక్షల నగదును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పట్టుకున్నారు. వేదాయపాలెం, కొడవలూరు, కావలి ఒకటో పట్టణం, గ్రామీణం, జలదంకి, చేజర్ల, మర్రిపాడు, కలువాయి, సైదాపురం పరిధిలో 196 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ తెలియజేశారు
పెట్రోల్ తాగి అస్వస్థతకు లోనైన రెండేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. నెల్లూరు నగరంలోని ఇరుగాళ్లమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా దంపతుల కుమారుడు కాలేషా.. ఈ నెల 7వ తేదీ సాయంత్రం వాటర్ బాటిల్లో అడుగున ఉన్న పెట్రోల్ ను తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.