Nellore

News March 31, 2024

REWIND: నెల్లూరు జిల్లాలో ఇద్దరు CMలు

image

బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన బెజవాడ గోపాల రెడ్డి మద్రాసు రాష్ట్రంలోనే మంత్రిగా పని చేశారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడటంతో 1955లో ఆయన CMగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడగా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే వాకాడుకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 డిసెంబర్ 17న CMగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం 297 రోజులు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
#ELECTIONS2024

News March 31, 2024

నెల్లూరు: వేసవిలో మండుతున్న పుచ్చకాయ ధరలు

image

జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఉపసమనం పొందేందుకు పుచ్చకాయల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న వ్యాపారులు కిలో 25 రూపాయలు చొప్పున కాయ సైజును బట్టి  రూ.100 నుంచి రూ.150 వరకు  విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో ప్రజలు అధిక రేట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

News March 31, 2024

ఉదయగిరి: 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ

image

ఉదయగిరి మండలంలో ఏప్రిల్ 3 నుంచి 8వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది వితంతు వృద్ధాప్య దివ్యాంగ తదితర పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎంపీడీవో డి.ఈశ్వరమ్మ తెలిపారు. మండలంలో 194 మంది వాలంటీర్లు ఉండగా వారి నుంచి మొబైల్ సిమ్ బయోమెట్రిక్ యంత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

News March 31, 2024

నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు

image

నెల్లూరు నగరం కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 2024 -25 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. ఒకటో తరగతిలో 64 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సీట్ల కోసం ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు.

News March 31, 2024

కోవూరు :రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

కోవూరు మండలంలోని పడుగుపాడు రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి సుమారు 55 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది.కావలి జీఆర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతుడి చొక్కాపై విజయలక్ష్మి టైలర్,గాంధీపార్కు,కోవూరు అని రాసి ఉందని,స్థానికుడిగా భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

News March 31, 2024

నెల్లూరు: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా

image

నెల్లూరు ఆనం కార్యాలయంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూప చారి, విద్యార్ది విభాగానికి,  వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం. రామనారాయణ రెడ్డి, యువనేత ఆనం రంగమయూర్ రెడ్డితోనే మా ప్రయాణమని అన్నారు. టీడీపీతో కలిసి పనిచేయటానికి, మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావటానికి కృషి చేస్తానని అన్నారు.

News March 31, 2024

నెల్లూరు: ఏపీ రాష్ట్ర నిర్వహణ విపత్తుల సంస్థ

image

నేడు 50 మండలాల్లో వడగాల్పులు రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ అధికారి కూర్పునాథ్ తెలిపారు. శుక్రవారం 36 మండలాల్లో వడగాల్పులు కడప జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

News March 31, 2024

ఉదయగిరి: ఆగిన డీజే టిల్లు-2 మూవీ.. ఫ్యాన్స్ ఆందోళన

image

ఉదయగిరి పట్టణంలోని సికిందర్ పిక్చర్ ప్యాలెస్ ఎదుట సినీ వీక్షకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. డీజే టిల్లు- 2 చిత్రం చూసేందుకు వచ్చిన వీక్షకులకు అసౌకర్యానికి గురై నిర్వాహకులతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చిత్రం ప్రసార సమయంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వీక్షకులు ఆందోళన చేపట్టారు. అనంతరం మూకుమ్మడిగా టికెట్ ఇచ్చి తిరిగి డబ్బులు తీసుకుని వెనుతిరిగారు.

News March 31, 2024

నెల్లూరు: హైకోర్టు జడ్జీలను కలిసిన కమిషనర్

image

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జయసూర్య, హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డిని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్‌లో జిల్లా న్యాయ అధికారుల వర్క్ షాష్‌కు న్యాయమూర్తులు హాజరయ్యారు.

News March 30, 2024

నెల్లూరు: నాయుడుపేటలో సిద్ధం బహిరంగ సభ

image

నాయుడుపేట పట్టణంలో ఏప్రిల్ 4వ తేదీన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సభకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.