India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి 15వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు ప్రభుత్వ మహిళా కళాశాలలో అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు.
మాజీ సీఎం చంద్రబాబుపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తాను భూకబ్జాలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి విరమించుకుంటానని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరో రాసి పంపిన స్క్రిప్ట్ చదవడం విడ్డూరంగా ఉందన్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏమి అభివృద్ధిలో చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు పర్యటనలో మొక్కుబడిగా పాల్గొని కీలక సమావేశాలకు దూరంగా ఉండటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. 2012 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ఓడారు.2014 ఎన్నికల్లో గెలిచారు. 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. కాగా బీజేపీ జాతీయ నేతలతో బొల్లినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సూచనలు, సలహా మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆయన వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో కావలిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
నెల్లూరు సిటీ పరిధిలో 5వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణని గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం గెలవగానే జులై నెల నుంచి 4వేలు పెన్షన్ ఇస్తామని అవ్వ, తాతలకు భరోసా కల్పించారు. వైసీపీ ప్రభుత్వం ఒక చేత్తో సంక్షేమ పథకాలిచ్చి మరొక చేత్తో అధిక ధరల రూపంలో లాక్కోవడం సరికాదన్నారు.
కావలి: పెదరాముడుపాళేనికి చెందిన చిన్నగోపాల్‌తో అసహజ శృంగారం చేసిన బుచ్చంగారి ఎజ్రానే ఈ హత్యలో నిందితుడని కావలి DSP వెంకటరమణ పేర్కొన్నారు. నిందితుడు చిన్నగోపాల్‌పై లైంగిక దాడికి పాల్పడడంతో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో నిందితుడు అతణ్ని తాళ్లతో కట్టేసి గొంతు వద్ద తాడుతో బిగించి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టేందుకు నిందితుడి తల్లి మంగమ్మ కూడా సహకరించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
సైదాపురం మండలం లింగసముద్రానికి చెందిన ప్రేమ్ కుమార్ చెన్నూరు రెసిడెన్షియల్ స్కూలులో చదువుకుంటున్నాడు. గురువారం రాత్రి స్కూలులో వార్షికోత్సవం సందర్భంగా వాహనం పార్కింగ్ విషయంలో స్థానిక యువకుడు విష్ణుకి ఇంటర్ చదివే ప్రేమ్ కుమార్ అన్న అశోక్ తో వాగ్వాదం జరిగింది. విష్ణు కత్తితో దాడి చేయడంతో అశోక్ గాయపడ్డాడు. ఈ మేరకు ఎస్సై మనోజ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయగిరి తెలుగుదేశం పార్టీలో రేగిన అసమ్మతి చల్లారేలా కనిపించడం లేదు. వింజమూరులో ఇవాళ టీడీపీ అధినేత నిర్వహించిన ప్రజాగళం సభకు మాజీ MLA బొల్లినేని రామారావు దూరంగా ఉన్నారు. చంద్రబాబు సభాస్థలికి రాకమునుపే బస్సులో ఆయనతో సమావేశమైన రామారావు.. తర్వాత రాత్రి చంద్రబాబు బస ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. ఉదయగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బొల్లినేనిని కాదని టీడీపీ అధిష్ఠానం కాకర్లకు అవకాశం కల్పించింది.
వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని.. ఎదురుతిరిగిన వారిపై కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కావలిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలు చూశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలపైనే కేసులు పెట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే టీడీపీకి షాక్ ఇచ్చారు. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం జగన్‌ను కలిసి చేరికపై చర్చించినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.